గూగుల్‌ ప్లే స్టోర్‌ లో వచ్చే ఎర్రర్స్‌కు వాటి కోడ్‌ల ఆధారంగా పరిష్కారమార్గాలు ఉన్నాయి. అవేంటో మీరు తెలుసుకోండి

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ లేదా గేమ్‌ ఏదైనా డౌన్‌లోడ్‌, అప్‌డేట్‌ చేసుకోవాలంటే కచ్చితంగా ప్లేస్టోర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఒక వేళ ఆ ప్లేస్టోర్‌ పనిచేయకుండా మొరాయిస్తే ఏం చేయాలి.. చాలా సార్లు ఎర్రర్‌ కోడ్ల ద్వారా
ఈ ఇబ్బందులు పడే ఉంటాం. గూగుల్‌ ప్లే స్టోర్‌ వాడేటప్పుడు వచ్చే ఎర్రర్స్‌కు వాటి కోడ్‌ల ఆధారంగా పరిష్కారమార్గాలు ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం...

Error Code 194
ఏదైనా యాప్‌ గేమ్‌ డౌన్‌లోడ్‌ చేస్తుంటే ఈ ఎర్రర్‌ వస్తుంటుంది. దీనికి సెట్టింగ్స్‌ - యాప్స్‌ లేదా అప్లికేషన్‌ మేనేజర్‌ - ఆల్‌ ట్యాబ్‌ - గూగుల్‌ ప్లే స్టోర్‌ ఓపెన్‌ చేయాలి. యాప్‌ వివరాలు ఓపెన్‌ చేసి ఫోర్స్‌ స్టాప్‌ బటన్‌ ఒత్తాలి. తరవాత క్లియర్‌ డాటా నొక్కాలి.. ఇదే తరహాలో గూగుల్‌ ప్లే సర్వీ్‌సకు కూడా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన యాప్‌, గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఎంచక్కా వచ్చేస్తుంది. అప్పటికీ రాకపోతే కంగరుఉ పడాల్సిన అవసరం లేదు. గూగుల్‌ ప్లే స్టోర్‌ లేటెస్ట్‌ వర్షన్‌ అప్‌డేట్‌ చేస్తే సరి సమస్య తీరుతుంది.

Error Code 941
యాప్‌ అప్‌డేట్‌ చేస్తుంటే ఈ ఎర్రర్‌ మెసేజ్‌ వస్తుంది. సెట్టింగ్స్‌ - యాప్స్‌ లేదా అప్లికేషన్‌ మేనేజర్‌ - ఆల్‌ ట్యాబ్‌ - గూగుల్‌ ప్లే స్టోర్‌ ఓపెన్‌ చేసి... క్లియర్‌ కేచీ కొట్టాలి. అదే తరహాలో డౌన్‌లోడ్‌ మేనేజర్‌ యాప్‌కి కూడా క్లియర్‌ కేచీతోపాటు క్లియర్‌ డాటాని కూడా కొట్టాలి. తరవాత అప్‌డేట్‌ చేసుకున్నా ఇబ్బంది రాదు. Error Code rh0, Error Code rp-c:s5 ఎర్రర్స్‌ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేయాల్సి ఉంటుంది.

Error Code 504
ఈ తరహ కోడ్‌ వచ్చినప్పుడు మొదట సెట్టింగ్స్‌ - యాప్స్‌ లేదా అప్లికేషన్‌ మేనేజర్‌ - ఆల్‌ ట్యాబ్‌ - గూగుల్‌ ప్లే స్టోర్‌ ఓపెన్‌ చేసి... క్లియర్‌ కేచీ కొట్టాలి. అప్పటికీ రాకపోతే జీమెయిల్‌ అకౌంట్‌ని రిమూవ్‌ చేసి మళ్లీ యాడ్‌ చేసుకోవాలి

Error Code 505
ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ యాప్స్‌ డూప్లికేట్స్‌ అనుమతులు ఉంటే ఈ తరహా ఎర్రర్‌ వస్తుంది. ఏ యాప్‌ వల్ల అనుమతి సమస్య వచ్చిందో దాన్ని గుర్తించి దాన్ని ఒకసారి అనిన్‌స్టాల్‌ చేయాలి. తిరిగి ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సమస్య తీరుతుంది

Error Code 491

ఇటువంటి ఎర్రర్‌ వచ్చినప్పుడు యాప్‌ లేదా గేమ్‌ డౌన్‌లోడ్‌ కాని అప్‌డేట్‌ కాని చేయలేం. సెట్టింగ్స్‌- అకౌంట్స్‌ లోకి వెళ్లి గూగుల్‌ ఖాతాని తీసేసి మొబైల్‌ రీస్టార్ట్‌ చేయాలి. తరవాత మళ్లీ గూగుల్‌ ఖాతాని యాడ్‌ చేసుకోవాలి. గూగుల్‌ ప్లేస్టోర్‌, ప్లే సర్వీస్‌ యాప్‌ల డాటాని, కేచీని క్లియర్‌ చేస్తే సమస్య తీరుతుంది.

ప్యాకేజీ ఫైల్‌ ఇన్‌వ్యాలీడ్‌ అని వస్తే మొదట యాప్‌ కేచీ క్లియర్‌ చేయాలి. అప్పటికీ కాకపోతే ప్లేస్టోర్‌ యాప్‌ని అనిన్‌స్టాల్‌ చేసి వెబ్‌సైట్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని విడిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అయినా సమస్య తీరకపోతే వైఫై డాటా ఆపేసి మొబైల్‌ డాటా నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఎర్రర్‌కోడ్‌ 498, 919 వంటివి వస్తే మెమరీ ఫుల్‌ అయినట్లు లెక్క అనవసర యాప్స్‌ తీసేయడం లేదా కేచీలాంటివి క్లియర్‌ చేసి మెమరీ వచ్చేలా చేయడం చేయాలి
క్లీయర్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ కేచీ - సెట్టింగ్స్‌ - యాప్స్‌ - ట్యాబ్‌ ఆల్‌ - గూగుల్‌ ప్లేస్టోర్‌ - క్లియర్‌ కేచీ
క్లీయర్‌ అవుట్‌ ప్లేస్టోర్‌ డాటా - సెట్టింగ్స్‌ - యాప్స్‌ - ట్యాబ్‌ ఆల్‌ - గూగుల్‌ ప్లేస్టోర్‌ - క్లియర్‌
ప్లేస్టోర్‌ అప్‌డేట్స్‌ని అనిన్‌స్టాల్‌ చేయడం -- సెట్టింగ్స్‌ - యాప్స్‌ - గూగుల్‌ ప్లేస్టోర్‌ - అప్‌డేట్స్‌ అనిన్‌స్టాల్‌
గూగుల్‌ ప్లే సర్వీ్‌సలో డాటా, కేచీని క్లియర్‌ చేయాలి -- సెట్టింగ్స్‌ - యాప్స్‌ - ట్యాబ్‌ ఆల్‌ - గూగుల్‌ ప్లే సర్వీస్‌ - క్లియర్‌ కేచీ, డాటా 

Latest News