నేను సీతను కాకపోవచ్చు.. కానీ పవన్ కల్యాణ్ రావణాసురుడు.. నిరూపిస్తే గొంతుకోసుకొంటా.. శ్రీరెడ్డి

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్‌పై భగ్గుమన్నది. తాను చేస్తున్న ఉద్యమాన్ని తొక్కేయడం మెగా ఫ్యామిలీ పనేనని ఆమె ఆరోపించారు. సినీ పరిశ్రమలో మహిళల కోసం ఉద్యమం చేస్తే ఏ వర్గం నుంచి మద్దతు రాలేదనే అభిప్రాయపడ్డారు. సినీ వర్గాలను కూడా శ్రీరెడ్డి తప్పుపట్టారు. తాజా ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వెల్లడించిన విషయాలు మీ కోసం.. అన్యాయానికి గురవుతున్న ఎంతో మంది మహిళల కోసం నేను చేసిన మీ టూ ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కేశారు. కేవలం పవన్ కల్యాణ్‌ను మాXX చోX అని తిట్టడాన్ని ఆధారంగా తీసుకొని నా ఉద్యమాన్ని నాశనం చేశారు. మహిళను తిట్టారని నన్ను టార్గెట్ చేసిన వాళ్లు ద్వంద ప్రమాణాలను పాటిస్తున్నది. కేవలం నా ఉద్యమాన్ని తొక్కేశారు.

ఒకవేళ నేను పవన్ కల్యాణ్ బూతులు తిట్టడం తప్పైతే మరి జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్‌ ఓ టీడీపీ నాయకురాలిని బహెన్ చోద్ అని తిట్టడం సమంజసమేనా? మీ పార్టీ నాయకుడు మహిళను తిట్టడం కరెక్టేనా? జనసేన నేతే స్వయంగా మహిళలపై దారుణంగా కామెంట్లు చేయడం సరైనదేనా అని శ్రీరెడ్డి అన్నారు. నేను తిట్టిన తిట్టును దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఫిలిం ఛాంబర్‌లో హంగామా చేశారు. పవన్ కల్యాణ్ ఓ రావణసూరిడి మాదిరిగా కనిపించారు. నేను సీతను కాకపోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ రావణాసురుడిగా భావిస్తాను. మీకొక న్యాయం.. ఇతరులకు ఓ న్యాయమా అని శ్రీరెడ్డి అన్నారు.

సినిమా ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ ఉంటుందనేది అందరికీ తెలుసు. సినిమా పరిశ్రమలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ పట్టించుకోరు. ఓ మహిళ చేస్తున్న ఉద్యమానికి ఎందుకు విలువ ఇవ్వరు. నేను నా కోసం, నా కుటుంబం కోసం చేయలేదే? సినిమా పరిశ్రమలో మహిళల కోసం చేస్తుంటే బాధ్యతగా వహించరు. మహిళా నటుల మానం, ప్రాణం సినీ పెద్దలకు ముఖ్యం కాదు. దగ్గుబాటి కుటుంబానికి నేను పెట్టిన శాపం వల్లే ఆ ఫ్యామిలీ చాలా కష్టాలు పడుతున్నది. రానా ఆరోగ్యం విషయంలో ఆ కుటుంబం చనిపోయినంత పనైంది. ఇప్పుడిప్పుడు రానా ఆరోగ్యం బాగుపడింది. లేకపోతే రానా ఒంట్లో బాగలేక చాలా ఆ కుటుంబం అనేక బాధలు పడింది. మళ్లీ ఆ ఫ్యామిలీని మళ్లీ చంపదలచుకోలేదు. అభిరామ్‌ను ఇక్కడ ఉండనీయకుండా ఎక్కడికో పంపించారు. నేను దగ్గుబాటి వద్ద డబ్బులు తీసుకొన్నారడంలో వాస్తవం లేదు. నేను కేసులు పెట్టుకుంటే పోతే వేల మంది ఉంటారు. నాకు అన్యాయం చేసిన వారిపై కేసులు పెట్టడం నా ఉద్దేశం కాదు. నాకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రభుత్వం సుమోటోగా కేసు పెట్టాలి. కానీ అలా జరుగలేదు. నేను డబ్బులు తీసుకొని తమిళనాడుకు వెళ్లిపోయారని ఎవరైనా నిరూపిస్తే మీడియా ముందు బట్టలు విప్పినట్టుగానే మీడియా ముందు గొంతు కోసుకొంటాను అని శ్రీరెడ్డి అన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)