ఆహా… వివేకా హత్యను డైవర్ట్ చేసే సూపర్ ఎత్తుగడ… ఏమిటది..?!

అనుకున్నట్టుగానే వైఎస్ వివేకా హత్య కేసు మలుపులు తిరుగుతున్నది… ఇప్పుడు వాళ్లో వీళ్లో కాదు, ఏకంగా జగనే స్పందించాడు… తన అనుమానాలు వ్యక్తం చేశాడు, సీబీఐ విచారణ కోరాడు… ఇప్పటికీ తెలుగుదేశం ముఖ్య నేతల నుంచి ఇంకా ఎదురుదాడి లేదు, సమర్థన లేదు, ఏ ప్రకటనలూ లేవు… జగన్ చెప్పిన వివరాలు కేసులో కొన్ని ట్విస్టులను చెబుతున్నాయి… అందరూ అనుకుంటున్నట్టు వివేకా బాత్రూంలో హత్యకు గురికాలేదు… జగన్ ఏమంటున్నాడంటే..? ‘‘బెడ్రూంలో తనను హతమార్చారు… గొడ్డలితో నరికారు… బాత్రూంలో కమోడ్‌పై పడి, దెబ్బలు తగిలి, రక్తం కారిపోయి చనిపోయినట్టు ఏదో సీన్ క్రియేట్ చేయాలనుకున్నారు… కానీ కుదర్లేదు… డ్రైవర్ పేరుతో ఓ లేఖ చూపిస్తున్నారు… వివేకా చనిపోతూ ఈ లేఖ రాశాడని చెబుతున్నారు… అంతా హంబగ్… ఇది రాజకీయ హత్యే…. ఆ హంతకుల సమక్షంలో బాబాయ్ ఈ లేఖ రాశాడా..? ఎవరో ఈ పనిని డ్రైవర్ చేసినట్టుగా పోలీసులు ఈ కేసును డైవర్ట్ చేస్తున్నారా..? నా కళ్ల ముందే పోలీసులు నానా డ్రామాలూ ఆడుతున్నారు… ఇంటలిజెన్స్ వెంకటేశ్వర్రావు పదే పదే ఫోన్లు చేస్తున్నాడు… ఇది క్రూరమైన హత్య…’’ అని జగన్ చెప్పాడు…

వైఎస్ మరణంపైనా దర్యాప్తు చేసింది సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణే అని కూడా జగన్ గుర్తుచేశాడు… లక్ష్మినారాయణ అంటే పక్కా చంద్రబాబు మనిషే అని అందరికీ తెలుసు… జగన్ అక్రమాస్తుల కేసులో కక్ష కట్టినట్టుగా వేధించి, పత్రికలకు లీకులిచ్చి, జనంలోకి విషప్రచారాన్ని పంపించిదీ తనే… అందుకని తనకు అనుమానాలు మరింత పెరిగాయని జగన్ అంటున్నాడు… బెడ్రూంలోనే చంపేసి, బాత్రూంలోకి తీసుకెళ్లి ఓ సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడనీ జగన్ చెబుతున్నాడు… ‘‘మా తాతను చంపేశారు, విశాఖ ఎయిర్‌పోర్టులో నన్నూ చంపాలనుకున్నారు, ఇప్పుడు మా బాబాయ్‌ని చంపేశారు, కచ్చితంగా వీటి వెనుక చంద్రబాబు హస్తం ఉంది’’ అని జగన్ కుండబద్ధలు కొట్టేశాడు… అవినాష్ రెడ్డే దీనికి కారణం అన్నట్టుగా మధ్యాహ్నం నుంచీ ఆదినారాయణరెడ్డి సహా తెలుగుదేశం నేతలు పలువురు, ఆ పార్టీ వాయిస్ ఆంధ్రజ్యోతి నానారకాలుగా జనంలోకి ప్రచారాన్ని తీసుకెళ్తున్నాయి…

జగన్ సీబీఐ విచారణ కోరాడు సరే, కానీ ఏపీ ప్రభుత్వం సీబీఐ రాకను, దర్యాప్తును నిషేధిస్తూ ఆల్ రెడీ ఓ నిర్ణయం తీసుకున్నది… ఏపీ పోలీసులు చంద్రబాబు కనుసన్నల్లో సరైన దర్యాప్తు చేస్తారనే నమ్మకం ఎవరికీ లేదు… తన మీద హత్యాప్రయత్నం కేసునే జగన్ హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు, మొన్నటి జయరాం హత్య కేసులోనూ అంతే… పైగా ఏపీ డీజీపీ ఠాకూర్ వ్యవహారశైలిపై వైసీపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది… ఇప్పుడు తాజాగా వివేకా హత్య… మరి దీన్ని ఎవరు దర్యాప్తు చేయాలి ఇక..?!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)