ఆర్ఆర్ఆర్ భామ డైసీ ఎడ్గార్‌ జోన్స్ గురించి తెలుసా.. రేర్ అండ్ క్యూట్ పిక్స్ మీకోస‌మే

ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ సరసన న‌టించ‌బోయే విదేశీ భామ డైసీ ఎడ్గార్‌ జోన్స్ గురించి ఆస‌క్తిర‌క విష‌యాలు.. ఆమె రేర్ అండ్ క్యూట్ ఫొటోలు మీకోసం.‘డైసీ ఎడ్గార్‌ జోన్స్‌’.. రాజమౌళి త‌న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్‌గా ఈ భామ పేరును ప్ర‌క‌టించ‌డ‌మే ఆల‌స్యం.. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంగ్లండ్ భామ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆమె వివ‌రాల కోసం గూగుల్ మొత్తం గాలిస్తున్నారు. అస‌లు ఎవ‌రీ డైసీ ఎడ్గార్ జోన్స్‌.. ఏం చేస్తుంది? ఎలా ఉంటుంది? ఆమె పుట్టు పూర్వోత్త‌రాలు ఏంటి?? ఇలాంటివ‌న్నీ తెలుసుకోవ‌డానికి తెగ ఆస‌క్తి చూపిస్తున్నారు. నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. అందుకే డైసీ గురించి వివ‌రాలు మీకు అందిస్తున్నాం. 
* డైసీ ఎడ్గార్ జోన్స్ బ్రిట‌న్‌కు చెందిన యువ నటి. స్వ‌స్థ‌లం ఇంగ్లండ్ రాజ‌ధాని లండ‌న్‌.
* వ‌య‌సు ప్ర‌స్తుతం 21 సంవ‌త్స‌రాలు.
* ఎత్తు 5.6 అడుగులు.
* ఆమె టీవీ సిరీస్‌లు, నాట‌కాల్లో ఫేమ‌స్‌. కోల్డ్‌ ఫీట్‌, వార్‌ ఆఫ్‌ ది వరల్డ్స్‌, జెంటిల్‌మాన్‌ జాక్‌, సైలంట్‌ విట్‌నెస్‌, ఔట్‌ నంబర్డ్‌ తదితర టీవీ సిరీస్‌లో న‌టించారు.
* 2018లో విడుద‌లైన ‘పాండ్‌ లైఫ్‌’ అనే సినిమాలో నటించింది, ‘వింటర్‌ సాంగ్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో కనిపించింది.
* డైసీ ఐదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి వచ్చింది.
* 15 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే ఇంగ్లాండ్‌లోని నేషనల్‌ యూత్‌ థియేటర్‌లో అడుగుపెట్టింది. ఈ థియేట‌ర్ వాళ్లు న‌ట‌న‌లో ద బెస్ట్‌ అనుకున్న‌వారినే ఎంపిక చేస్తుంటారు. నాట‌కాల్లో న‌టించే అవ‌కాశం ఇస్తారు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే థియేట‌ర్‌కు ఎంపికై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.
* 2017లో ప్ర‌ముఖ ర‌చ‌యిత మోహ్సిన్ హ‌మీద్ ర‌చించిన ‘ది రిలక్టెంట్‌ ఫండమెండలిస్ట్‌’ న‌వ‌ల ఆధారంగా రూపొందించిన నాట‌కంలో డైసీకి లీడ్‌రోల్ ద‌క్కింది. అప్ప‌టి నుంచి నాట‌క‌రంగంలో ఆమె పేరు మార్మోగింది.
* డైసీ అమెరికన్‌, ఐరిష్‌ యాసలో మాట్లాడగల‌దు. డాన్స్‌, మ్యూజిక్‌, గిటార్‌ వాయించడం, పాటలు పాడటం ఆమెకు ఇష్టం.
* గులాబీలంటే ఎంతో ఇష్ట‌ప‌డే డైసీ.. తన కుడిభుజంపై గులాబీ పువ్వు టాటూ వేయించుకుంది.
* ఆమెకు విహార యాత్రలంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌తో క‌లిసి టూర్‌కు వెళ్ల‌డం మ‌హా స‌ర‌దా. ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు వెళ్లి ఆ ఫొటోల‌ను షేర్ చేస్తుంది.
* త్రో బ్యాక్ పేరుతో అప్పుడ‌ప్పుడు త‌న పాత ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న జూ ఎన్టీఆర్ స్నేహితురాలి/ప్రేమికురాలి పాత్రలో కనిపించనుంది. మనకు అసలు తెలియని ఈ పాత్రను రాజమౌళి ఎలా తీర్చిదిద్దనున్నాడో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఏదేమైనా వెల్కమ్ టు టాలీవుడ్ డైసీ ఎడ్గార్ జోన్స్.

 

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)