ఈ 8 సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం మీకైనా తెలుసా?

కొన్ని సినిమాలు హిట్ అవుతాయి.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇది సాధారణంగా జరిగే విషయమే. అయితే మరికొన్ని సినిమాలు ఉంటాయి.. ఇవి హిట్ అయి ఫ్లాప్ అవుతుంటాయి.అదెలా అంటే, సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతాయి. కానీ కలక్షన్ల పరంగా చుస్తే మాత్రం నిరాశ పరుస్తాయి. అలాంటి చాలా సినిమాలు మన టాలీవుడ్ లో గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. థియేటర్ల వద్ద ఆడకపోయినా.. ఈ సినిమాలకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి అలాంటి సినిమాలలో కొన్నింటిని చూద్దామా..

1) ఖలేజా
త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కి మహేష్ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో మనం ఈ సినిమాలో చూశాం. ఎప్పుడూ చూడనటువంటి మహేష్ బాబు సరికొత్త యాక్టింగ్ ఈ సినిమాలో చూడవచ్చు. హీరోని దేవుడిని చేసే కాన్సెప్ట్ ను కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటే, మరికొంతమంది నెగటివ్ గా తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ ను అర్ధం చేసుకున్నవాళ్ళు సినిమా హిట్ అన్నారు.. అర్ధం చేసుకోలేని వాళ్ళు సినిమా ఫ్లాప్ అన్నారు అంతే తేడా.
2) ఆరెంజ్
టాలీవుడ్ లో ఇలాంటి స్టోరీతో సినిమా రావడం ఇదే మొదటిసారి అనుకుంటా. ప్రేమకథతో తెరకెక్కిన సినిమాలు మనం ఇప్పటివరకు చాలానే చూసుంటాం. కానీ ఈ సినిమా లవ్ స్టోరీస్ అన్నింటికి తోపు అనొచ్చు. నిజాలు చెప్పి ప్రేమించడం, ఎక్కువ కాలం ప్రేమ ఉండదు అనే భిన్నమైన కాన్సెప్ట్ కొంతమంది ఆడియన్స్ కి ఎక్కక.. సినిమా బాగాలేదు అనేశారు. అర్ధం చేసుకున్నవాళ్ళు మాత్రం 'ఆరెంజ్'కి ఫిదా అయిపోయారు.

3) 1- నేనొక్కడినే
సుకుమార్ సినిమా అంటే బోలెడన్ని లాజిక్స్ అండ్ క్రియేటివిటీ ఉంటుంది. మరి అతని సినిమాలను అర్ధం చేసుకోవాలంటే లాజికల్ థింకింగ్ ఉండాలి. '1- నేనొక్కడినే' సినిమా కూడా ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటేనే అర్ధమవుతుంది. ఈ సినిమాకు కల్ట్ ఫాన్స్ ఇప్పటికీ ఉన్నారు. టీవీ లో ఎప్పుడు వేసినా..టీవీ సెట్స్ కు అతుక్కుపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు.
4) తీన్ మార్
పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. కేవలం అర్జున్ పాల్వాయ్ పాత్ర కోసం సినిమా చూసినవాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ సినిమాకే హైలైట్ గా ఉన్నాయి. 'అందంగా లేదని అమ్మని.. కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేయలేం కదా'.. లాంటి హార్ట్ టచింగ్ డైలాగ్స్ రాయాలంటే త్రివిక్రమ్ తరువాతే ఎవరైనా. ఆయన డైలాగ్స్ డెప్త్ గా ఆలోచించేవారికే అర్థమవుతాయి.

5) ప్రస్థానం
శర్వానంద్ ను నటుడిగా ఇంకో మెట్టు ఎక్కించిన చిత్రం 'ప్రస్థానం'. సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలుగా నటించిన ఈ చిత్ర కథ చాలా కొత్తగా ఉంటుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి దేవ కట్టా దర్శకత్వం వహించారు. మంచి సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ లేటుగానే తెలుస్తుంది అనుకుంటా.. ఈ సినిమాకు థియేటర్ల వద్ద జనాలే కరువైపోయారు. కానీ క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా.. ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది.
6) రాఖీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన సినిమా 'రాఖీ'. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. చెల్లికి జరిగిన అన్యాయాన్ని తిప్పికొట్టి సమాజం మీద ఓ యువకుడు జరిపిన పోరాటమే ఈ చిత్ర కథ. తారక్ ను ఎక్కువగా మాస్ హీరోగా మనం చూస్తుంటాం.. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ పండించిన ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అయినా ఎక్కడో తేడా కొట్టేసింది.

7) ఆర్య-2
'ఆర్య'కి సీక్వెల్ గా సుకుమార్ రూపొందించిన చిత్రం 'ఆర్య 2'. మొదటి భాగం సక్సెస్ అయినంతగా రెండవ భాగం ఆకట్టుకోలేకపోయింది. విశ్లేషకుల నుండి మిశ్రమ స్పందనలను చవిచూసి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. అయినా అల్లు అర్జున్ డాన్సులు, సుకుమార్ సృజన, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం విశేషంగా ఆదరించబడ్డాయి.
8) ఓయ్
కొన్ని ప్రేమకథలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి ప్రేమకథలలో 'ఓయ్' సినిమా చాలా ప్రత్యేకంగా ఉంది. ఎంతో పొయిటిక్ గా సాగే ఈ కథ జనాలందరినీ ఆకట్టుకుంది. కానీ థియేటర్ల వద్ద ఆశించినంత స్థాయిలో ఆడలేదు. యువన్ రాజా శంకర్ అందించిన సంగీతం మాత్రం ఇప్పుడు విన్నా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)