మొత్తం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టునే చంపేయాలని ప్లాన్ వేశారా..?

ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరిగిన టెర్రర్ అటాక్ గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది. క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల వద్ద విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు క్రైస్ట్ చర్చ్ కాల్పుల ఘటనలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.అయితే మొత్తం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును చంపేయాలనే ప్లాన్ వేశారా అన్న అనుమానాలకు కూడా తావిస్తోంది.

క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ మసీదును సందర్శించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు లోపలికి వెళ్తుండగా కాల్పుల మోతతో మసీదు హోరెత్తింది. దీంతో భయభ్రాంతులకు గురైన ఆటగాళ్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆటగాళ్లు క్షేమంగా ఉన్నారని, అయితే, మానసికంగా కొంత షాక్‌కు గురయ్యారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆటగాళ్లను హోటల్ రూములకు తరలించామని, పరిస్థితులు చక్కబడే వరకు హోటల్‌కే పరిమితం కావాలని కోరినట్టు చెప్పారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, ముష్పికర్ రహీంలు ట్వీట్లు చేశారు. తమను అల్లానే రక్షించాడని.. తాము చాలా అదృష్టవంతులమని, ఇటువంటి ఘటనను మరోమారు చూడాలనుకోవడం లేదని వాళ్ళు ట్వీట్లు చేశారు. క్రైస్ట్ చర్చ్ కాల్పుల నేపథ్యంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన మూడో టెస్టును రద్దు చేశారు.

ఈ ఘటనలో అనుమానితులుగా భావిస్తూ న్యూజిలాండ్ పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ పోలీసుల కస్టడీలో ఉన్న నలుగురిలో ఒకరు ఆస్ట్రేలియన్ అని తెలుస్తోంది.న్యూజిలాండ్ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ఈ ఘటనపై మాట్లాడుతూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇదొక చీకటి రోజు అని ఆమె అన్నారు. తమ పౌరులకు న్యూజిలాండ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్రైస్ట్ చర్చ్ లోని అన్ని పాఠశాలలను మూసివేయించారు. ప్రార్థనల కోసం ముస్లింలు ఎవరూ మసీదుల్లోకి వెళ్లవద్దని సూచించారు. నగరంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ మికీ బుష్ ఆదేశాలు జారీ చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)