ఐస్‌ తింటుండగా ఏదో తగిలింది.. ఏంటా అని చూస్తే..

వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఐస్, ఐస్ క్రీమ్‌లు అమ్ముకుంటూ ఊళ్లల్లో తిరుగుతుంటారు. నాణ్యత ఉంటుందో లేదో చూసుకోకుండానే వాటిని కొనడానికి జనాలు ఎగబడుతుంటారు. అలాంటి వారికి షాక్‌కు గురి చేసే ఘటన ఒకటి కరీంనగర్ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. జిల్లాలోని హుజూరాబాద్ మండలంలో ఐస్ కొన్న ఓ యువకుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రాంపూర్‌ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు రంగాపూర్ శివారులో తోపుడు బండి వద్ద ఐస్‌ కొన్నాడు. అతడు దాన్ని తింటుండగా, నోటికి ఏదో తగిలినట్లు అనిపించింది. ఏంటా అని చూసే సరికి.. అందులో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో అతడు వాంతులు చేసుకున్నాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోట తెలియండంతో ఆ ఊరి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాధిత యువకుడు ఐస్ తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)