అదనపు కట్నం ఇవ్వలేదని నవవధువుపై రేప్

అడిగినంత కట్నం ఇవ్వలేదన్న ఆవేశంతో నవ వధువుపై ఆమె భర్త, అతడి బంధువు అత్యాచారానికి పాల్పడిన నీచపు ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫరానగర్‌లో జరిగింది. అత్తింటివారు అదనపు కట్నం ఇవ్వలేదన్న ఆగ్రహంతో వధువును ఓ గదిలో బంధించిన భర్త, అతడి బంధువుతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన బాధితురాలు మరుసటి రోజు ఉదయం వరకు అక్కడే పడి ఉంది. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి సర్జరీ చేశామని, కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. ఈ నెల 6న జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

పెళ్లయిన తర్వాత బంధువుతో కలిసి మద్యం తాగిన వరుడు అత్తింటివారిని అదనపు కట్నం అడిగాడు. వారు ఇవ్వలేమని చెప్పడంతో ఆ రాత్రి తన భార్యను ఓ గదిలో బంధించాడు. బంధువుతో కలిసి రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉదయం తీవ్ర రక్తస్రావంతో పడివున్న ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో తన సోదరిని భర్తే రేప్ చేశాడని బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కోసం రూ.7లక్షలు ఖర్చు చేస్తే.. కట్నం ఆశతో తన సోదరి జీవితాన్ని నాశనం చేశాడని అతడు కన్నీరుమున్నీరవుతున్నాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకుని ఐపీసీ 376డి(గ్యాంగ్ రేప్), 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపాడు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ముజఫరానగర్‌ రూల్ ఎస్పీ అలోక్ శర్మ తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)