పెళ్లిరోజు రాత్రే వధువుపై సామూహిక అత్యాచారం

పెళ్లి రోజు రాత్రే 26 ఏళ్ల వధువుపై భర్తతోపాటు అతని అన్న సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన యూపీలోని ముజప్ఫర్ నగర్ పట్టణ శివార్లలో వెలుగుచూసింది. గత నెల 6వతేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కట్నం విషయంలో వధువు కుటుంబసభ్యులతో వరుడి కుటుంబానికి వివాదం ఏర్పడింది. పెళ్లయ్యాక వధువును అత్తింటివారే గదిలో పెట్టి తాళం వేశారు.భర్త, అతని సోదరుడు ఇద్దరూ కలిసి పీకలదాకా మద్యం తాగి నవ వధువుపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం అవుతున్నా గదికి తాళం వేయడంతో నవవధువు రాత్రంతా అలాగే గడిపింది. తెల్లారాక నవ వధువును ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. కట్నం విషయంలో ఏర్పడిన వివాదంతోనే తన కూతురిపై అఘాయిత్యం చేశారని, తాను రూ.7లక్షలు వెచ్చించి పెళ్లి చేశానని అయినా వారు ఇలా చేశారని వధువు సోదరుడు ఆవేదనగా చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఐపీసీ సెక్షన్ 376 డి, 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అలోక్ శర్మ చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)