క‌ళ్లు తిరుగుతున్నాయా : ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తీసేయాల‌ని టీడీపీ కంప్ల‌యింట్

చిత్తూరు: ఎన్నికల వేళ ఏపీలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్లు తొలగించాలని ఎన్నికల సంఘానికి అధికార టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఇదెక్కడి చోద్యం.. ఫ్యాన్లు తొలగించాలని కోరడం ఏంటి అని ఎన్నికల అధికారులు షాక్ అయ్యారు. అసలు ఫ్యాన్లు తీసేయమని ఎందుకు ఫిర్యాదు చేశారు అని అడిగితే.. ఫ్యాన్... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సింబల్ అని.. అందుకే వాటిని తొలగించాలని ఆ టీడీపీ నేత చెప్పారట. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫ్యాన్లు తీసేయాలని టీడీపీ నేత ఈసీకి ఫిర్యాదు చేసిన చిత్రం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో జరిగింది. చిత్తూరు రామకుప్పం మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త జయశంకర్ ఈ ఫిర్యాదు చేశారు. తహసిల్దార్ జనార్దన్ ఆయన ఫిర్యాదుని స్వీకరించారు. విషయాన్ని ఎన్నికల అధికారులకు పంపిస్తానని చెప్పారు.

ఫ్యాన్లు తొలగించాలనే తన ఫిర్యాదుని జయశంకర్ సమర్థించుకున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దం అని చెబుతూ... ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం చంద్రబాబు ఫొటోలను ఉద్యోగులు తొలగించారని.. మరి ఫ్యాన్లను ఎందుకు తీసేయరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు.. చంద్రబాబు ఫొటోలు, విగ్రహాలకు ముసుగు వేశారని.. అదే నిబంధనను ఫ్యాన్లకూ వర్తింపజేయాలని జయశంకర్ డిమాండ్ చేశారు. పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు... వైసీపీ ఎన్నికల సింబల్ ఫ్యాన్ చూసి ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని జయశంకర్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి ఓ న్యాయం, జగన్ కి ఓ న్యాయమా అని జయశంకర్ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ అనేది అందరికి సమానంగా వర్తింపజేయాలని కోరారు. వైసీపీ ఎన్నికల సింబల్ కావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్లు తొలగించాలని టీడీపీ కార్యకర్త చేస్తున్న డిమాండ్.. రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదెక్కడి విడ్డూరం అని అంతా విస్తుపోతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)