ఉత్కంఠకు తెరపడింది.. రాజమౌళి సినిమా లేటెస్ట్ అప్డేట్స్

దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తదుపరి చిత్రం రూపుదిద్దుకుంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఏ ఒక్క అప్డేట్ బయటకు రానివ్వని జక్కన్న.. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు. రామ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను రివీల్ చేయడంతో పాటుగా.. ఈ సినిమాలోని కథానాయికలను కూడా చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు. అలియా భట్ ను ఒక కథానాయికగా ప్రకటించగా.. మరొక హీరోయిన్ గా విదేశీ నటి డైసీ అడ్గర్ జోన్స్ నటిస్తుంది అని చిత్రబృందం తెలియజేశారు. కాగా, ఈ సినిమాలో ఇతర భాషా నటులు అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.

నిజజీవిత పాత్రలతో ఫిక్షన్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలలో కనిపిస్తున్నారు. 1920ల కాలం నాటి కథగా రాజమౌళి రూపొందిస్తున్నారు. 1897లో ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు పుట్టారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. మూడు సంవత్సరాలు పాటు ఇంటిపట్టున లేరు. తిరిగొచ్చాక ఆయన స్వతంత్ర పోరాటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణం మనకు తెలిసిందే. 1901లో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో కొమురం భీం పుట్టారు. ఆయనకు కూడా యుక్త వయసులో ఉన్నప్పుడు ఇంటి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. తిరిగొచ్చాక నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనుల కోసం పోరాడారు. వాళ్ళ చరిత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అదే ఈ సినిమాలో చూపించబోతున్నాం అని కథను రివీల్ చేశాడు జక్కన్న. ఈ ఇద్దరు స్వతంత్ర సమరయోధుల గురించి మనకు తెలిసిన కథ కాదు.. తెలీని కథ చెబుతున్నాం అని రాజమౌళి ప్రకటించాడు. అంతేకాకుండా ఈ సినిమాను జులై 30, 2020న రిలీజ్ చేస్తామని చెప్పాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)