అదే నా లాస్ట్ సినిమా అవ్వొచ్చు: రాజమౌళి

రెండు భాగాలుగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘బాహుబలి’. తెలుగులో దర్శకధీరుడిగా పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ సినిమాతో తెలుగు చలనచిత్ర స్థాయిని పెంచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు రాజమౌళి. అలాంటి దర్శకుడు తర్వాత ఏ సినిమా చేయబోతున్నారని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు ప్రముఖ తెలుగు హీరోలతో మల్టీస్టార్ మూవీ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. ఎన్టీయార్, రామ్ చరణ్‌తో చారిత్రాత్మక సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ టైటిల్‌తో డీవీవీ దానయ్య నిర్మాణంలో సినిమా మొదలెట్టేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నేడు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జక్కన్న ఓ ఆసక్తికర విషయం చెప్పారు. అదేంటంటే..

బాహుబలి మొదలు పెట్టినప్పటి నుంచే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుగా ‘మహాభారతం’ గురించి చెప్పేవారు. ఎప్పటికైనా మహాభారతం సినిమా తీయాలన్నదే తన కల అని అవకాశం వచ్చిన ప్రతిసారీ బయటపెట్టేవారు. ఆర్ఆర్ఆర్ గురించి జరిగిన మీడియా సమావేశంలో కూడా జక్కన్నకు మహాభారతంపై ప్రశ్న ఎదురైంది. ‘బాహుబలి తర్వాతే మహాభారతం సినిమా తీస్తారని ప్రచారం జరిగింది. ఇంతకీ మహాభారతం ఎప్పుడు మొదలవుతుంది. మీ మైండ్‌లో ఆ ప్రాజెక్ట్ ఏ స్టేజ్‌లో ఉంది?’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘మహాభారతం మొదలు పెడుతున్నానని నేను ఎప్పుడూ చెప్పలేదు. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను. కానీ నేను తీసే తర్వాతి సినిమా అదే అని జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. నేను ఎన్నిసార్లు క్లారిఫై చేసినా నా నెక్ట్స్ చిత్రం అదే అని ఫిక్సయ్యారు. నేను ఎక్కడికి వెళ్లినా దాని గురించే అడుగుతారు. బహుశా అదే నా చివరి చిత్రం అవ్వొచ్చు. దాన్ని సిరీస్‌గా తీసే ఆలోచన ఉంది.’’ అని రాజమౌళి చెప్పారు. బాహుబలి వెబ్ సిరీస్ కూడా త్వరలో మొదలుపెట్టబోతున్నట్లు ఈ సందర్భంగా జక్కన్న వెల్లడించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)