‘ఎన్టీఆర్ మహానాయకుడు’ క్లోజింగ్ కలెక్షన్స్... ఎంత పెద్ద డిజాస్టర్ అంటే?

సినిమా రంగంలో జయాపజయాలు సర్వసాధారణం. ప్రతి హీరోకూ హిట్లు ఉంటాయి, ప్లాపులు ఉంటాయి. ఈ రెండింటిని విడగొట్టి చూసినపుడు హిట్ సినిమాల్లో పెద్ద హిట్... ప్లాప్ సినిమాల్లో అతిపెద్ద డిజాస్టర్ ఇలా బేరీజు వేసి వాటి స్థాయి అంచనా వేస్తుంటారు. అలా అంచనా వేసి చూస్తే... బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ 'ఎన్టీఆర్-మహానాయకుడు' నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదేమో? ఈ వారంతో 'ఎన్టీఆర్-మహానాయకుడు' చిత్రం బిజినెస్ బాక్సాఫీసు వద్ద పూర్తిగా క్లోజ్ కాబోతోంది. హైదరాబాద్ ఏరియాలో ఒకే ఒక థియేటర్లో ప్రస్తుతం ఈ చిత్రం ప్రదర్శితం అవుతుండగా నేటితో సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ప్రదర్శితం అవుతున్న అన్నింటి నుంచి సినిమా తొలగించనుండటంతో బిజినెస్ సమాప్తం కాబోతోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు కేవలం రూ. 3.81 కోట్ల షేర్ మాత్రమే వసూలైంది. బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ మొత్తం వసూలు కావడం అంటే డిజాస్టర్లకే డిజార్ అని చర్చించుకుంటున్నారు.ఏరియా వైజ్: నైజాంలో రూ. 70 లక్షలు, సీడెడ్ రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 24 లక్షలు, గుంటూరు రూ. 70 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 24 లక్షలు, కృష్ణ రూ. 35 లక్షలు, నెల్లూరు రూ. 15 లక్షలు, రెస్టాఫ్ ఇండియా రూ. 25 లక్షలు, ఓవర్సీస్ రూ. 60 లక్షలు వసూలైంది.

‘ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు దాదాపు రూ. 50 కోట్లు నష్టపోయారు. వాటిని కొంతమేర భర్త చేయడానికి ఎలాంటి ముందస్తు అడ్వాన్స్ లేకుండానే సినిమాను వారికే ఇచ్చేశారు. నిర్మాతకు 60శాతం, డిస్ట్రిబ్యూటర్లకు 40 శాతం దక్కేలా డీల్ కుదిరింది. అయితే డిస్ట్రిబ్యూటర్లకు కనీసం 10 శాతం కూడా లాస్ రికవరీ కాలేదు.సంక్రాంతికి వచ్చిన తొలి భాగం బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవ్వడం. ‘ఎన్టీఆర్ మహానాయకుడు'లో జనాలకు రుచించని పొలిటికల్ ఫ్లేవర్ ఉండమే ఈ చిత్రం తీవ్ర పరాజయం పాలవ్వడానికి కారణంగా చెప్పుకుంటున్నారు. ఎన్టీ రామారావు రాజకీయ జీవితంలోని అసలు విషయాలను ఇందులో చూపింక పోవడంతో ప్రజలు ఈ చిత్రాన్ని చూడటానికి ఇష్టపడలేదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)