అల్లు అరవింద్ కుట్ర, వాళ్ళిద్దరి కెరీర్ నాశనం చేస్తున్నాడా.. మండిపడ్డ తమ్మారెడ్డి!

ఇటీవల సోషల్ మీడియా ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడ్డు అదుపు లేకుండా రూమర్స్ సృష్టించేస్తుంటారు. ఇక యూట్యూబ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్ళు పెట్టె థంబ్ నైల్స్ కి, లోపల ఉండే కంటెంట్ కు అసలు సంబంధం ఉండదు. అలా అల్లు అరవింద్ గురించి పిచ్చి పిచ్చి థంబ్ నైల్స్ తో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. అక్కినేని హీరోలు అఖిల్, నాగ చైతన్య విషయంలో ఈ వార్తలు వ్యాపించాయి.

అక్కినేని బ్రదర్స్ అఖిల్, నాగ చైతన్యలతో అల్లు అరవింద్ వేరు వేరుగా రెండు చిత్రాలని నిర్మించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రాకున్నా విశ్వసనీయ సమాచారం అయితే వస్తోంది. అఖిల్ తదుపరి చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో ఉండబోతోందని, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారని వార్తలు వచ్చాయి. మరో వైపు నాగ చైతన్య కూడా 100 పర్సెంట్ లవ్ తర్వాత మరోమారు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న దర్శకుడు. నాగచైతన్య చిత్రానికి కూడా ఎవరో కొత్త దర్శకుడు అంటూ ప్రచారం జరుగుతోంది. అఖిల్ ఇంతవరకు హిట్ ఖాతా తెరవలేదు. నాగచైతన్యకు కూడా ఇటీవల సరైన విజయాలు లేవు. ఈ దశలో వీరిద్దరి కెరీర్ నాశనం చేయడానికే అల్లు అరవింద్ ఈ చిత్రాలు చేస్తున్నారని పిచ్చి పిచ్చి రూమర్స్ వ్యాపిస్తున్నాయి. యూట్యూబ్ లో ఇలాంటి థంబ్ నైల్స్ తో వీడియోలు కనిపించడంతో తమ్మారెడ్డి భరద్వాజ మండి పడ్డారు.

నాగ చైతన్య, అఖిల్ కెరీర్ నాశనం చేయడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేయడం ఏంటయ్యా బాబూ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అల్లు అరవింద్ సినిమాలు తీసేది డబ్బులు సంపాదించడానికి. చెత్త సినిమాలు తీసి పోగొట్టుకోవడానికి కాదు. ఆయనకు ఇంకేం పనిలేదా లేక పిచ్చోడు అనుకుంటున్నారా అన్ని తమ్మారెడ్డి అన్నారు. పిచ్చి పిచ్చి క్యాప్షన్స్ పెట్టే వాళ్ళు మీకే ఇన్ని విషయాలు తెలిసి ఉంటే.. అక్కినేని ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో పెద్దదే మరి వాళ్లకు తెలియదా అని అన్నారు. అఖిల్,నాగ చైతన్య ఏమైనా చిన్న పిల్లలా.. గీతా ఆర్ట్స్ పెద్ద బ్యానర్ కాబట్టి ఒప్పుకున్నారేమో.. దర్శకుడు చెప్పిన కథ నచ్చితే చేస్తారు లేకుంటే లేదు. ఏ నిర్మాత అయినా డబ్బులు సంపాదించడానికే సినిమాలు చేస్తారు.. పోగొట్టుకోవాలని ఎవరూ అనుకోరు. సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి నిర్మాతలు ఎలాగైనా సినిమాని హిట్ చేయాలనే ప్రయత్నిస్తారు. ఎవర్నో నాశనం చేసే మనుషులు కాదు.. ఆ అవసరం కూడా వాళ్లకు లేదు అని తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)