క్రేజీ హీరోయిన్ గర్భవతా.. ఆసుపత్రిలో సీక్రెట్‌గా.. అసలేం జరిగిందంటే!

క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఏదో ఒక వివాదంలో, రూమరో ప్రియాంక చోప్రాని వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ప్రియాంక చోప్రా గురించి వైరల్ అవుతోంది. ప్రియాంక గర్భవతి అంటూ ప్రచారం మొదలైపోయింది. ఈ వార్తలని ప్రియాంక తల్లి మధు చోప్రా ఖండించింది. ఈ రూమర్స్ ఎలా పుట్టాయో కూడా తెలిసింది. గత ఏడాది డిసెంబర్ లో ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రియాంక చోప్రాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో ప్రియాంక గర్భంతో ఉన్నట్లుగా కనిపించింది. దీనితో ప్రియాంక గర్భవతి అంటూ వార్తలు సృష్టించేశారు. ఆ ఫోటోలపై ప్రియాంక ఎలాంటి వివరణ ఇవ్వక పోవడంతో ఆ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఎట్టకేలకు ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ వార్తలని ఖండించింది.

ప్రియాంక గర్భవతి అంటూ వస్తున్న వార్తలపై మధు చోప్రా స్పందిస్తూ.. ఆ వార్తలు అవాస్తవం అని తెలిపింది. కెమెరా లోపం, ఫోటోలు సరిగా తీయకపోవడం వలెనే మీకు అలా అనిపించిందని మధు చోప్రా క్లారిటీ ఇచ్చింది. ప్రియాంక ధరించిన దుస్తుల్లో కూడా లోపం లేదు. ఆ ఫోటోలు సరిగా రాలేదు అంతే అని ప్రియాంక తల్లి వివరణ ఇచ్చారు. ఈ రూమర్స్ వచ్చిన తర్వాత ప్రియాంక చోప్ర ముంబైలో ఓ హాస్పిటల్ లో కనిపించింది. మీడియాతో కూడా మాట్లాడకుండా హాస్పిటల్ నుంచి సీక్రెట్ గా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీనితో మరోమారు ప్రియాంక గర్భవతి అంటూ వార్తలు వ్యాపించాయి. ప్రియాంక మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోతుందేమో కానీ, తప్పించుకుని మాత్రం వెళ్ళదు అంటూ బాలీవుడ్ లో వార్తలు వ్యాపించాయి. దీనిపై ఆరా తీయగా అసలు నిజం బయటపడింది.

ప్రియాంక వెళ్లిన ఆసుపత్రిలో ఆమె బంధువు ఒకరు చికిత్స పొందుతున్నారట. వారిని పరామర్శించడానికే ప్రియాంక ఆ ఆసుపత్రికి వెళ్లినట్లు తేలింది. ఆ సమయంలో మీడియాతో హడావిడి సృష్టించడం ఇష్టం లేకే ప్రియాంక సైలెంట్ గా వెళ్లిపోయిందని అంటున్నారు. దీనితో ప్రియాంక ప్రెగ్నెన్సీ రూమర్స్ కు తెరపడ్డట్లు అయింది. ప్రియాంక తన అందం అభినయంతో హాలీవుడ్ లో కూడా క్రేజ్ సొంతం చేసుకుంది. హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలో నిక్ జోనస్ తో పరిచయం కావడం, అది కాస్త ప్రేమగా మారడం జరిగిన సంగతి తెలిసిందే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)