ఫేస్‌బుక్‌లో లైవ్‌ రికార్డు చేసి.. దారుణమైన పని చేసిన ప్రేమ జంట

బెంగళూరు: కులాలు వేరైనా ధైర్యంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అయితే రెండు వైపుల కుటుంబ సభ్యులు బెదరించడంతో మనస్తాపానికి లోనై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమజంట హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరు గోరిపాళ్యకు చెందిన రక్షిత (19), శేషాద్రి (20)లు పరస్పరం ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఇందుకు అభ్యంతరం తెలిపారు. అగ్రకులానికి చెందిన రక్షిత కుటుంబీకులు బెదరించడంతో దిక్కుతోచక తమ కష్టాలన్నింటినీ ఫేస్‌బుక్‌లో లైవ్‌ రికార్డు చేసి చిక్కమగళూరు జిల్లాలోని మూడిగెరె వద్ద ఉరి వేసుకుని బలవన్మరణం పాలయ్యారు. ప్రేమించడమే మేం చేసిన తప్పా..? కులాల అడ్డుగోడలు మమ్మల్ని ఏకం చేస్తాయన్న నమ్మకం లేదు..? అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులను కలుసుకుని కష్టాలు చెప్పుకోవాలని తలపోశామని అయితే ఈలోపే బెదరింపులు అధికం కావడంతో ఇహలోకాన్ని వీడాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రేమికుల జంట ఆత్మహత్య ఘటన అటు ఫేస్‌బుక్‌లో తీవ్ర కలకలం రేపింది. మూడిగెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)