మీ భర్త వర్జినా? స్వాతి నాయుడు నుంచి ఊహించని సమాధానం...

యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు వివాహం ఫిబ్రవరిలో అవినాష్ అనే వ్యక్తితో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తమ ప్రేమ, రిలేషన్, పెళ్లి తదితర అంశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవినాష్‌తో 8 నెలలు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, అబ్బాయి ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదని, అందుకే వారు ఎవరూ లేకుండానే తమ పెళ్లి జరిగిందని స్వాతి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా తమ వర్జినిటీ గురించి కూడా ఆమె ధైర్యంగా, ఎలాంటి మోహమాటం లేకుండా చెప్పడం గమనార్హం.

మీ భర్త అవినాష్ వర్జినా? శృంగారం విషయంలో మీ వద్దే తొలి అనుభవం పొందారా? అనే ప్రశ్నకు స్వాతి నాయుడు రియాక్ట్ అవుతూ... నేనేమీ నేర్చించలేదు. అతడికి నాకంటే ముందు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని తెలిపారు. ఈ కాలంలో అబ్బాయిల్లో వర్జిన్ ఎవరు ఉన్నారు? ఎవరైనా వర్జిన్ అని చెబితే కచ్చితంగా అబద్దం చెబుతున్నట్లే అని స్వాతి నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె భర్త అవినాష్ రియాక్ట్ అవుతూ... నేను వర్జిన్ అనడం లేదు, కానీ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనేది నిజం కాదని స్పష్టం చేశారు.

సెక్స్ అనేది హ్యూమన్ ఎమోషన్. కొన్ని సార్లు కంట్రోల్ చేసుకోలేరు. ప్రేమికులుగా ఉన్నపుడు కొన్నిసార్లు కావాలని కలవడమో.. లేక బలహీన పరిస్థితుల్లో కమిట్ అయిపోయి... తర్వాత ఇలా జరిందని ఏడవటమో చేస్తారని స్వాతి నాయుడు అభిప్రాయ పడ్డారు. ‘‘ఈ మధ్య సర్వేల్లో తేలిన విషయం ఏమిటంటే.. కొందరు అమ్మాయిలు బాయ్ ఫ్రెండును తమకే సొంతం చేసుకోవడానికి, వేరే అమ్మాయిల వైపు చూడకుండా ఉండేందుకు సెక్సువల్‌గా సంతృప్తి పరుస్తున్నారు. కానీ అబ్బాయిలు అలా ఉండరు.. పని అయిపోయింది కదా.. ఇంకో అమ్మాయిని చూద్దాం అనే ధోరణలో ఉంటారు'' అని తెలిపారు. అవినాష్ కంటే ముందు తనకు కొంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారని, కొందరితో సెక్సువల్ రిలేషన్ వరకు వెళ్లింది. కొన్ని కారణాల వల్ల వారితో విడిపోవాల్సి వచ్చింది. అవినాష్ నన్ను, నా మనసును అర్థం చేసుకున్నాడు. నా గురించి ఆయనకు అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నట్లు స్వాతి నాయుడు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)