పెళ్లి పీటలపై కూర్చున్న లవర్‌పై కాల్పులు

లక్నో: పెళ్లి పీటల మీద కూర్చున్న ప్రియురాలిని తుపాకీతో కాల్చి అనంతరం ప్రేమోన్మాది ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా గాజియాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆశ, బిజేంద్ర అనే యువతి, యువకుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వివాహానికి ఆశ తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆశకు తొందరగా పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఆశకు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుండగా బిజెంద్ర అక్కడికి చేరుకొని పెళ్లి కూతురుపై కాల్పులు జరిపాడు. అనంతరం తనని తాను కాల్చుకున్నాడు. పెళ్లి కూతురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా, బిజెంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)