అమెరికా సైనికులకు హైదరాబాద్‌లో శిక్షణ

అమెరికాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నది. అమెరికా తన సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు జపాన్‌లోని ఓకినావా తర్వాత భారత్‌లోని హైదరాబాద్‌ను ఎంచుకున్నది. ఇబ్రహీంపట్నంలోని ఎన్‌ఎస్‌జీ సెంటర్‌లో మన దేశానికి చెందిన నేషనల్ సెక్యురిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ)తో కలిసి అమెరికా సైనికులు తర్ఫీదు పొందుతున్నారు. ఈ నెల12న ప్రారంభమైన ఈ ప్రత్యేకశిక్షణ ఏప్రిల్ 5వ తేదీ వరకు కొనసాగనున్నది. భవిష్యత్తులో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇరు దేశాల బలగాలు కలిసి ఎదుర్కోవడంపై శిక్షణ ఇస్తున్నట్టు యూఎస్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండో హెచ్‌ఎం స్మిత్ తెలిపారు. కమాండో ఆపరేషన్స్, పరస్పర సహకారం, మెళకువలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. పసిఫిక్ రీజియన్‌లో ఉగ్రదాడులు ఎదుర్కోవడంతోపాటు శాంతిస్థాపన కోసం భారత్‌తో కలిసి పనిచేయడంలో భాగంగా అమెరికా ఈ శిక్షణ చేపట్టింది. అమెరికా సైతం భారత్‌ను ముఖ్యమైన రక్షణరంగ భాగస్వామిగా భావిస్తున్నది. ఈ శిక్షణతో హైదరాబాద్.. డిఫెన్స్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధిలో అమెరికా-భారత్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే అవకాశం ఉన్నదని మిలిటరీ వర్గాలు చెప్తున్నాయి. యూఎస్ కౌన్సిల్ జనరల్ కేథరిన్‌హడ్డా మాట్లాడుతూ ఈ శిక్షణతో రక్షణకు సంబంధించి భారత్-అమెరికా మధ్య ఉన్న సమన్వయం మరింత బలపడుతుందని చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)