ధోనీ విమర్శకులకు తెలివి లేదు: ఆసీస్ స్పిన్ దిగ్గజం

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఫాం కారణంగా గత కొంతకాలంగా విమర్శలు ఎదురుకుంటున్నాడు. గతంలోలా ధోనీ ఈ మధ్యకాలంలో రాణించకపోవడంతో ఇకపై అతను రిటైర్‌ కావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అదేస్థాయిలో ధోనీకి మద్దతు కూడా లభిస్తోంది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహా.. పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ధోనీకి మద్దతుగా నిలిచారు. తాజాగా ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా ధోనీకి మద్దతునిచ్చారు. ధోనీని విమర్శించే వాళ్లు ఏం మాట్లాడుతన్నారో వాళ్లకే తెలియదని ఆయన అన్నారు. ‘‘పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు ధోనీ లాంటి అనుభవం ఉన్న వ్యక్తి జట్టులో ఉండటం ఎంతో ముఖ్యం. అతను చాలా గొప్ప ఆటగాడు. ధోనీని విమర్శించే వాళ్లు తెలివితక్కువగా ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదు’’ అని ఆయన అన్నారు. అంతేకాక.. ప్రపంచకప్‌లో ఆడే జట్టులో ధోనీ ఉండటం ఎంతో కీలకం అని ఆయన చెప్పారు. ధోనీతో పాటు పంత్‌కి కూడా జట్టులో చోటు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)