పడక గదికి రమ్మన్నారు... నరకం చూపించారు, దారుణంగా వేధింపులు.. వారి అంతు చూస్తా!

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను బట్టబయలు చేసే మీ టూ ఉద్యమం బాలీవుడ్‌ను అప్రమత్తం చేస్తున్నది. అన్యాయానికి గురైన హీరోయిన్లు అప్పుడప్పుడు తమ బాధలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా దంగల్ ఫేం ఫాతీమా సనా షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను లైంగికంగా వేధించారని ఆమె పేర్కొన్నారు. తనపై జరిగిన వేధింపుల గురించి ఫాతీమా మాట్లాడుతూ.. నేను సెక్సువల్ వేధింపుల బాధితురాలినే. నన్ను కూడా దారుణంగా వేధించారు. పక్కలోకి వస్తే వేషాలు ఇస్తామన్నారు. నాకు ఎదురైన పరిస్థితులను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాను. నాకు ఎదురైన సంఘటనలు చెప్పి నా వ్యక్తిత్వంపై మరక వేసుకొను అని ఫాతీమా సనా షేక్ అన్నారు.

నాపై వేధింపులకు పాల్పడిన వారి గురించి నేను బయటకు చెప్పను. వారి భరతం ఎలా పట్టాలో నాకు తెలుసు. నా సన్నిహితులతో చర్చిస్తున్నాను. వారి సహకారం తీసుకొంటున్నాను. ఆ నరకయాతన పడిన క్షణాలకు గుణపాఠం చెబుతాను అని ఫాతీమా పేర్కొన్నారు. మీ టూ ఉద్యమం తర్వాత భారతీయ సినిమా పరిశ్రమలో పరిస్థితులు మారుతున్నాయి. చాలా మంది ప్రముఖుల్లో గుబులు రేకెత్తుతున్నది. కొందరి పేర్లు బయటకు రావడం, వారి ప్రతిష్ట మంటగలవడంతో ఇతరుల్లో భయం మొదలైంది. సినీ పరిశ్రమలో మహిళలను గౌరవించే సంప్రదాయంలో కొంత మెరుగుగా ఉంది. సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది.

మీ టూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటులు సాజిద్ ఖాన్, అలోక్ నాథ్, కైలాష్ ఖేర్, వికాస్ బెహల్, నానా పాటేకర్ లాంటి పేర్లు బయటకు రావడం సంచలనం రేపాయి. చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్లు తమపై జరిగిన వేధింపులను బయటపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దంగల్ తర్వాత ఫాతీమా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం కొంత బాధించింది. కాకపోతే ఆ చిత్రంలో నటించినందుకు ఎలాంటి బాధలేదు అని ఫాతీమా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)