అలీ గురించి శ్రీరెడ్డి హాట్ కామెంట్.. పవన్‌ కళ్యాణ్‌కు అందుకే దూరం?

కమెడియన్ అలీ వైసీపీలో చేరడంతో టీడీపీతో పాటు చాలా మంది షాకయ్యారు. జనసేన పార్టీ వారికైతే ఇంకా పెద్ద షాక్ అంటూ వ్యాఖ్యానించారు నటి శ్రీరెడ్డి. కొన్ని రోజుల ముందు ఏపీ సీఎం చంద్రబాబుతో సన్మానం చేయించుకోవడంతో ఆయన తెలుగు దేశం పార్టీలోకి వెళతారని అంతా అనుకున్నారని, ఎవరూ ఊహించని విధంగా వైసీపీ కండవా కప్పుకోవడం ఆశ్చర్యపరిచిందని శ్రీరెడ్డి తెలిపారు. కొన్ని సంవత్సరాల వెనక్కి వెళితే.. పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఒక యాక్టర్. ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ అలీ నటించడంతో పాటు, ఆయనకు ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తిగా అలీ గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 15 ఏళ్లకుపైగా వారి మధ్య స్నేహం ఉంది. కానీ అలీ జనసేన పార్టీలో చేరకుండా వైసీపీలో చేరడంతో లోపల ఏదో జరుగుతుంది అనే అనుమానం అందరిలోనూ ఉందని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్... అలీతో అంత ఇదిగా ఉండటం లేదు అనేది వాస్తవం. ఒకటి రెండు సంఘటనల్లో అలీ హర్ట్ అయ్యారు. స్నేహంలో వచ్చిన తేడాల వల్ల, రాజకీయాల్లోకి వస్తానని సుముఖత వ్యక్తం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ అంతగా ఇంట్రస్టు చూపకపోవడం కూడా... అలీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని శ్రీరెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్ ముందు నుంచీ ఒక ధోరణి కనబరుస్తూ వస్తున్నారు. తన ఫ్యామిలీ నీడ రాజకీయం మీద పడకూడదు అని జాగ్రత తీసుకుంటున్నారు. ప్రజారాజ్యానికి సంబంధించి ఫెయిల్యూర్ దృష్టిలో పెట్టుకుని మెగా ఫ్యామిలీ తన పార్టీ వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్నేహితులకు టిక్కెట్లు ఇచ్చుకుంటున్నారనే మాట కూడా రాకుండా అలీ లాంటి వారిని దూరం పెట్టారని శ్రీరెడ్డి తెలిపారు.

అలీని నిర్లక్ష్యం చేయడం, అంతకు ముందు ఒకటి రెండు సందర్భాల్లో అభిప్రాయ భేదాల వల్ల జనసేనలోకి రావడానికి ఇష్టపడలేదు. ఒకసారి ట్రై చేసిన తర్వాత ఆయనకు సీన్ అర్థమైంది కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ వైపు వెళ్లలేదని తెలిపారు. అలీ తన సొంత ప్రాంతంలో, రాజమండ్రిలో సేవా కార్యక్రమాలు గట్టిగానే చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా అలీ మాటసాయం మాత్రమే కాదు, ఫైనాన్సియల్‌గా సపోర్ట్ చేస్తారు అని చెబుతారు. ఎవరు బాధలో ఉన్నా వెంటనే సహాయం చేసే గుణం ఉంది. లక్షల్లో హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అలీగారు నాకు కూడా చాలా హెల్ఫ్ చేశారు. కొన్ని ఛానల్స్‌లో యాంకర్‌గా పెట్టించారు. ఇతర దేశాల్లో ఈవెంట్స్ ఉన్నపుడు కూడా నన్ను రెఫర్ చేశారు. వాళ్ల నాన్నగారి పేరు మీద సంస్థ స్థాపించి కళాకారులకు, వికలాంగులకు, పేదవారికి సహాయం చేస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన రాకముందు నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టే ఆయన గురించి ఈ మాటలు మాట్లాడటానికి అర్హురాలిగా ఫీలవుతున్నట్లు శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. డిసిప్లేన్ లేని ఇప్పుడే పుట్టిన ఓ పార్టీలోకి వెళ్లడం కన్నా... డిసిప్లేన్ ఉన్న పార్టీని ఎంచుకోవడం రైట్ ఆప్షన్. నాతో పాటు ఎంతో మంది కళకారులకు హెల్ఫ్ చేశారు. నా సినిమాల్లో గాడ్ ఫాదర్ ఎవరు అంటే అలీ గారి పేరు చెబుతాను.. అని శ్రీరెడ్డి అన్నారు. గుంటూరులో టీడీపీలో స్థానికంగా ఉన్నవారికి సీటు ఇవ్వడం వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటం, పోటీ టఫ్‌గా ఉన్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక అక్కడ ఇవ్వ లేమని తెలుగుదేశం వారు చెప్పడంతో... ఆయన వైసీపీ ఆశ్రయించక తప్పలేదని శ్రీరెడ్డి స్పష్టం చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)