మీ తమ్ముడు సీఎం అయి ఏం పొడుస్తాడు.. ముందు నీ బిడ్డకు సంబంధాలు చూడండి.. నాగబాబుపై శ్రీరెడ్డి ఫైర్!

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌కు మద్దత్తు తెలుపుతూ, టిడిపి, వైసిపిలని విమర్శిస్తూ నాగబాబు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా టిడిపిని విమర్శిస్తూ నాగబాబు చేస్తున్న వీడియోలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల నాగబాబు ఇకనైనా చంద్రబాబుకు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కల్పిస్తామని సెటైరికల్‌గా ఓ వీడియో చేశారు. ఆ వీడియోకు కౌంటర్‌గా యూట్యూబ్ సంచలనం శ్రీరెడ్డి మరో వీడియో పోస్ట్ చేసింది. నాగబాబు ఓ వీడియో పోస్ట్ చేశాడు. చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవాలని ఏదేదో మాట్లాడాడు. మీకు కౌంటర్ ఇవ్వడానికి నేను ఉన్నానుగా అంటూ శ్రీరెడ్డి తెలిపింది. చంద్రబాబుగారు తుదిశ్వాస వరకు రాజకీయాల్లో ఉంటానని అన్నారు. అది చాలా ఎమోషనల్ మాట. నాగబాబు చెప్పినట్లుగా మీకెందుకు సర్ అంత శ్రమ. ఇక్కడ మెగా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ తమ్ముడిని సీఎం చేద్దాం అని అనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న హీరోలందరికీ హిట్స్ ఇద్దామని తపన పడుతున్నారు.

నాగబాబుని గురించి శ్రీరెడ్డి వెటకారంగా మాట్లాడుతూ.. సరే నాగబాబు చంద్రబాబుగారు రాజకీయాల నుంచి తప్పుకుంటే అంత అనుభవం ఉన్న నాయకుడు ఏపీలో ఎవరు ఉన్నారు. మీ తమ్ముడా.. మీ తమ్ముడు సీఎం అయి ఏం పొడుస్తాడు.. ఆంధ్రలో ఉన్న కన్నె పిల్లలందరిని పెళ్లి చేసుకుంటాడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. లేక ఇష్టారాజ్యంగా అందరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించడానికా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. గతంలో మీకు కాంగ్రెస్ నుంచి మూటలు అందాయి. మీ తమ్ముడు సీఎం అయ్యాక ఆ డబ్బుతో ఆంధ్ర మొత్తం కంపెనీలు పెట్టుకుంటారా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. మీ ఇష్ట ప్రకారం రాక్షస రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. అసలు చంద్రబాబు గారి వయసుతో మీకేం పని అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. అసలు మీ వయసు ఎంత అని నాగబాబుని ప్రశ్నించింది.

చంద్రబాబుకు 70 ఏళ్ళు వచ్చాయి.. ఇక రిటైర్ కావాలని అంటున్నారు. మీకు కూడా 60 ఏళ్ళు వచ్చాయి. మీ పిల్లలకు పెళ్లిళ్లు చేయరా. పెళ్లి సంబంధాలు చూసుకోకుండా ఇలాంటి పనులు మీకు ఎందుకు. 60 వచ్చిన జబర్దస్త్ లో తెగ కష్టాపడిపోతూ వెకిలి నవ్వులు ఎందుకు నవ్వుతున్నారు అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఈ వయసులో కూడా వాళ్లకు, వీళ్లకు ఫోన్ చేసి మీ కొడుకుకి అవకాశాలు ఎందుకు ఇప్పించుకుంటున్నారు. ఎలాగూ మెగా స్టాంప్ ఉందిగా. బతికేస్తాడు లే అని శ్రీరెడ్డి తెలిపింది. ఈ మధ్యనే చిరంజీవికి షష్టిపూర్తి కూడా జరిగింది. ఇంకా ఎందుకు సైరా అంటూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి రెస్ట్ తీసుకోకుండా వాళ్ళతో పాటు ఆయన కూడా సినిమాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారు అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. వీటన్నింటికి మీ దగ్గర సమాధానం ఉందా అని నాగబాబుని ప్రశ్నించింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)