200 మంది బాలికలపై అత్యాచారం: వీడియోలతో బ్లాక్ మెయిల్

తమిళనాడు రాష్ట్రంలో సెక్స్ రాకెట్ ముఠా వందలాదిమంది యువతులు..బాలికల జీవితాలను చిదిమేసింది. ఈ దారుణానికి మూల సూత్రధారి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ఇది ఇంత కాలం నిరాటంకంగా సాగిపోయింది. దిగ్భ్రాంతి కలిగించే ఈ భారీ సెక్స్ రాకెట్ ఎట్టకేలకు బయటపడింది. 20 ఏళ్లలోపు కాలేజీ అమ్మాయిలను మోసం చేసి.. బలవంతంగా ఈ దారుణకాండ చేస్తు..వాటిని వీడియోలు తీసి వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావటంతో తమిళనాడులో సంచలం రేపింది. ఈ ఘోరానికి 200 మందికిపైగా యువతులు, బాలికలు బలైపోయారు. ఈ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. ఈ ముఠా నాయకుడు అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన యువనేత కావటం గమనించాల్సిన విషయం.

ఈ ముఠాలోని వ్యక్తులు ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలతో పరిచయం పెంచుకుని..తరువాత ప్రేమ పేరుతో సన్నిహితంగా ఉన్నప్పుడు వాటిని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. తరువాత వారి కుటుంబ సభ్యులకు అవి చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయలు వసూలు చేసారని పోలీసులు తెలిపారు. బాధిత యువతులందరూ కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు చెందినవారేనని పోలీసులు గుర్తించారు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఎట్టకేలకు విసిగిపోయిన ఓ బాధిత యువతి ఫిర్యాదుతో బయటపడింది. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొల్లాచ్చికి చెందిన శబరిరాజన్‌(25), తిరునావుక్కరసు (25) సతీశ్‌(28), వసంతకుమార్‌(27)లతో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి సెల్‌ఫోన్లలో వందలాదిమంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలను చూసి నిర్ఘాంతపోయారు. రెండువందల మందికిపైగా బాధితులు ఉంటారని ఈ వీడియోల ఆధారంగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

తమ బంధువులు చదువుతున్న స్కూల్స్..కాలేజీలల్లోని అమ్మాయిల సెల్‌ఫోన్ నంబర్లను ముఠా సభ్యులు సేకరించి వారితో పరిచయం పెంచుకుంటు..ధనవంతుల్లా వారిని నమ్మించి లొంగిదీసుకుని..తరువాత వారికి మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడతారు. దీన్ని సీక్రెట్ గా వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుంటారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు విషయం తెలిసిన ముఠా సభ్యులు కేస్ విత్ డ్రా చేసుకోకుంటే..చంపేస్తామని బెదిరించినట్టుగా బాధిత యువతి వాపోయింది. ఇలా బెదిరించిన వారిలో సెంథిల్‌(33), బాబు (26), నాగరాజ్‌ను (27) పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడైన నాగరాజ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో అరెస్ట్ అయిన రెండు రోజుల్లోనే నాగరాజు బయటకు రావడం వివాదాస్పదస్పదంగా మారింది. అన్నాడీఎంకేపై ప్రతిపక్షాలు విరుచుకుపడటంతో అధికారపార్టీ నాగరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)