స్వాతి నాయుడు పెళ్లిపై శ్రీరెడ్డి కామెంట్: నీ మొగుడి ఫేస్ చూశా, వీలైతే ఆ చెత్త ఫీల్డ్ వదిలేయ్ అంటూ..

యూట్యూబ్ శృంగార తార స్వాతి నాయుడు ఫిబ్రవరి 23న అవినాష్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. 8 నెలలుగా లివ్ ఇన్‌ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు స్వాతి నాయుడు వెల్లడించారు. ఆ అబ్బాయికి అన్నీ తెలిసే తనతో రిలేషన్ పెట్టుకున్నాడని, ఇద్దరికీ ఇష్టం కాబట్టే తమ బంధం పెళ్లి వరకు వచ్చిందని తెలిపారు.స్వాతి నాయుడు వివాహంపై శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ పెళ్లి జరుగడం తనకు సంతోషాన్ని ఇచ్చింది అంటూనే కొన్ని సూచనలు చేశారు. ఇంతకీ స్వాతి నాయుడు వివాహంపై శ్రీరెడ్డి ఏం కామెంట్ చేశారో చూద్దాం... కంగ్రాజ్యులేషన్స్ స్వాతి గారు. మీరంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. మీ పెళ్లి విషయం తెలిసి చాలా సంతోషపడ్డాను. మీరు ఇటీవల మీ భర్తతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. మీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు.

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీ ఫస్ట్ నైట్ గురించి గుచ్చి గుచ్చి అడగటం నాకు కోపం తెప్పించింది. నేను అక్కడ ఉంటే అతడిని చంపేసేదాన్ని. నాకు గానీ ఆ యాంకర్ కనిపిస్తే తప్పకుండా చెంప వాయిస్తాను. అలాంటి వారిని ఎంకరేజ్ చేయవద్దు.. అని శ్రీరెడ్డి సూచించారు. వీలైతే మీరు ఆ డర్టీ ఫీల్డ్ వదిలేయండి. యాంకర్ ఓవర్ యాక్షన్ చేయడంతో మీ భర్త ఫేసులో కాస్త అసౌకర్యానికి గురైన భావన కనిపించింది. ఆయన్ను బాగా చూసుకో. ఐలవ్ యూ.... అంటూ స్వాతిరెడ్డిపై తన ప్రేమాభిమానాలు చాటుకుంది శ్రీరెడ్డి.

ఇటీవల ఇంటర్వ్యూలో స్వాతి నాయుడు మాట్లాడుతూ... దొంగతనం చేయొద్దు, మరొకరిని మోసం చేయకుండా ఏ పని చేసినా అది మంచి పనే. కొందరు వ్యభిచారం తప్పు అంటారు. నేనైతే దాన్ని తప్పు అనను. ఒక అమ్మాయి డబ్బుల కోసం పడుకుంటుంది. నీకు ఇష్టమైతే డబ్బులు ఇచ్చి నీ కోరిక తీర్చుకో, నువ్వు చేసేదంతా చేసి ఆమె చేసేది మాత్రమే తప్పు అని చిత్రీకరించడం సరైంది కాదన్నారు. పెళ్లి తర్వాత కూడా నా ప్రొఫెషన్ కొనసాగిస్తాను. నా లక్ష్యం జీవితంలో సెటిల్ అవ్వడమే. పోర్న్ మూవీస్ అవకాశం వచ్చినా చేయడానికి నేను సిద్ధమే. పోర్న్ అనేది కూడా ఒక జాబ్. ఆ జాబ్ లో నేను సెటిల్ అవుతాను. ఒక్కోక్కరికి ఒక్కో పని ఇష్టం ఉంటుంది. నాకు పోర్న్ ఇష్టం కాబట్టి అదే చేస్తానని స్వాతి నాయుడు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)