పాక్ టీ స్టాల్ లో అభినందన్ ఫొటో : ఎందుకు వాడారో తెలుసా..?

ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్, డేరింగ్ పైలట్ అభినందన్ వర్దమాన్ ఇపుడు ఇండియాలోనే కాదు.. పాకిస్థాన్ లోనూ ట్రెండింగ్ అయ్యారు. అభినందన్ స్టైల్ మీసకట్టును ఇండియాలో అందులోనూ.. తమిళనాడులో వేలమంది ఫాలో అవుతున్నారు. అభినందన్ ను.. ఓ పాకిస్థానీ టీ స్టాల్ ఓనర్ కూడా తనకు బ్రాండ్ అంబాసిడర్ గా మార్చుకున్నాడు. అతడి పేరు ఖాన్. కరాచీలోని ఓ గల్లీలో రోడ్డుపై అతడో టీ స్టాల్ నడుపుతున్నాడు. తన టీ స్టాల్ దగ్గర అతడు ఓ బ్యానర్ ను ప్రదర్శించాడు. టీ తాగుతున్న అభినందన్ ఫొటో దానిపై ఉంది. దానిపై ఉర్దూలో ఓ కామెంట్ పెట్టాడు. దాని అర్థం తెలిస్తే.. అబ్బా.. ఏం మార్కెటింగ్ స్కిల్స్ బాబూ అనేస్తున్నారు. “ఖాన్ టీ స్టాల్… ఇక్కడ టీ తాగితే … శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు” ఇదీ అక్కడ ఆయన బ్యానర్ పై పెట్టిన కామెంట్. ఆ టీ స్టాల్ తెలివితేటలను సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. వాడకం అంటే నీదే అంకుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)