కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ చేయకూడనివి

ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీలు పాటించాలిసిన నిబంధనలు. కోడ్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వ పథకాల్లో, చట్టాల్లో మార్పులు చేయరాదు. అధికారికంగా కొత్త పథకాలు ప్రకటించరాదు.
* అధికార పార్టీ చేయకూడనివి:
- అధికార పార్టీ తమ అధికారాలను అడ్డంపెట్టుకొని ప్రజలను ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు.
- ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయరాదు. కోడ్ అమల్లోకి రాకముందే నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే రిక్ర్యూట్‌మెంట్‌ కొనసాగించవచ్చు.
-ప్రభుత్వ డబ్బుతో టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇవ్వరాదు.
-ప్రచారానికి ప్రభుత్వ వాహనాలు, మెషిన్స్, పరికరాలు ఉపయోగించరాదు.
-మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారానికి అధికారిక హోదాలో వెళ్లరాదు.
-అధికారిక కార్యక్రమాలను, ఎన్నికల ప్రచారసభలను, పార్టీ కార్యక్రమాలను కలిపి నిర్వహించరాదు.
-ప్రతిపక్ష పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వడంలో వివక్ష చూపించరాదు.

* సాధారణ నిబంధనలు:
- అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సభలు, ర్యాలీలపై స్థానిక పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలి.
- పాఠశాలలు, మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల ఆవరణలో ప్రచారం నిర్వహించరాదు.
- ప్రత్యర్థులపై చేసే విమర్శలపైనా ఆంక్షలు ఉన్నాయి. పార్టీ లేదా అభ్యర్థి పనితీరుపై మాత్రమే విమర్శలు, ఆరోపణలు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత దూషణలు చేయరాదు. కుల, మత పరమైన అంశాల జోలికి వెళ్లకూడదు.
- ఓటర్లను ఆకట్టుకునేలా డబ్బు పంచడం, బహుమతులు ఇవ్వడం, మద్యం పోయడం లాంటివి చేయకూడదు.
- ప్రత్యర్థుల దిష్టిబొమ్మల ఊరేగింపు, దహనం లాంటివి చేయకూడదు.
- పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపేయాలి.
- పోలింగ్ రోజున ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందినవారు మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి.
-పోలింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా పార్టీ పేరు, గుర్తు ఉన్న బ్యాడ్జ్‌ను ధరించాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)