జాతీయ ముఠా : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. భారీ మొత్తంలో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి రూపాయల విలువ చేసే కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఈ ముఠా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి కొకైన్, హెరాయిన్ తెచ్చి నగరంలోని ప్రముఖులకు, సంపన్నుల పిల్లలకు విక్రయిస్తున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా కర్మన్ ఘాట్ దగ్గర రూ. కోటి విలువైన డ్రగ్స్ పట్టుకున్నామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. చెన్నై, వైజాగ్, హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో జైల్లో కలుసుకున్న నలుగురు.. ముఠాగా ఏర్పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని సీపీ వివరించారు. కొంతకాలంగా ఈ ముఠా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన నలుగురు నిందితులు ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)