పాపం పసివాళ్లు: నకిలీ మందులకు 3 లక్షల మంది బలి

నకిలీ మందులు ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గతేడాది దాదాపు మూడు లక్షల మంది చిన్నారులు ఫేక్ మెడిసిన్స్ కు బలైపోయారు. మలేరియా, నిమోనియా, బీపీ, గుండె జబ్బులు, కేన్సర్, పెయిన్ రిలీఫ్ కు ఇచ్చే మందులకు, ఎక్కువగా నకిలీలను తయారు చేస్తున్నట్లు అమెరికన్ సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది. ఆన్ లైన్ మార్కెట్ లో తక్కువ నాణ్యత కలిగిన మందులు కూడా మరణాలకు ఓ కారణమని వారు వెల్లడించారు. ‘‘నిజం చెప్పాలంటే నకిలీ మందులే ఈ మూడు లక్షల మంది పిల్లల్ని హత్య చేశాయి” అని రీసెర్చర్లలో ఒకరైన డా.జోయెల్ బ్రెమన్ పేర్కొన్నారు.

నకిలీ మందులు మూడు రకాలు
ఫేక్ మెడిసిన్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్ యూహెచ్ వో) మూడు రకాలుగా వర్గీకరించింది. ఒకటి నాణ్యత లేనివి, రెండు లైసెన్స్ లేని మందులు, మూడు గుర్తింపును మార్చుకుని మార్కెట్లోకి చొరబడేవి. రిపోర్టు ప్రకారం నకిలీ మందుల తయారీ ఏడాదికేడాది పెరిగిపోతోంది. ఫైజర్‌‌ గ్లోబల్ సెక్యూరిటీ అనే సంస్థ చాలా రకాల మందుల్ని తయారు చేస్తుంది. దీంతోపాటు ఫేక్ డ్రగ్స్ ను ఏరివేసేందుకు ఈ కంపెనీకి ఓ టీమ్ ఉంది. అయినా ప్రపంచవ్యాప్తంగా 113 దేశాల్లో 95 రకాల ఫైజర్‌‌ కంపెనీ మందులకు, నకిలీ డ్రగ్స్ ను తయారు చేస్తున్నారని రిపోర్టు తెలిపింది. ముఖ్యంగా పేద, మధ్య ఆదాయ దేశాల్లో నకిలీ మందులు ఎక్కువగా చలామణీ అవుతున్నాయని సైంటిస్టులు వివరించారు. వీటి విలువ దాదాపు 200 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా వేశారు.

ఆన్ లైన్ లో ‘నకిలీ’ విహారం
నకిలీ మందుల సరఫరాకు ఇంటర్నెట్ అడ్డాగా మారిందని రీసెర్చర్లు తెలిపారు. ప్రస్తుతం దాదాపు 35 వేలకు పైగా వెబ్ సైట్లు ఆన్ లైన్ లో మందులు అమ్ముతున్నాయని చెప్పారు. వీటి ద్వారానే ఫేక్ డ్రగ్స్ దందా నడుస్తోందని వెల్లడించారు. ఫైజర్‌‌ గ్లో బల్ సెక్యూరిటీ సంస్థ ‘క్సనాక్స్’ అనే సొంత ప్రొడక్టును 250 బాటిల్స్ కొనుగోలు చేసింది. వాటిని పరిశీలించగా 96 శాతం నకిలీవని తేలింది. కొన్ని సార్లు గ్రూపులుగా, మరికొన్నిసార్లు టెర్రరిస్టులతో సంబంధాలు నెరుపుతూ ఫేక్ డ్రగ్స్ ను అక్రమంగా ప్రపంచ దేశాల్లోకి చొప్పిస్తున్నారని రీసెర్చర్లు వివరించారు. గుండె జబ్బులు, కేన్సర్, నొప్పి నివారణకు వాడే మందులకు సైతం నకిలీలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.

అంతర్జా తీయ ఒప్పందంతోనే కట్టడి
గత పదేళ్లుగా డబ్ల్ యూహెచ్ వో, నిపుణులు, నాన్ ప్రాఫిట్ సంస్థలు ఈ సమస్యపై అవగాహన కల్పించాలని ప్రయత్నం చేశాయి. కానీ ఇవి విఫలమైనట్లు రీసెర్చర్లు చెప్పారు. పేట్రేగిపోతున్న నకిలీ మందుల దందాను అడ్డుకో వాలంటే ఓ అంతర్జా తీయ ఒప్పందాన్ని ప్రపంచదేశాలన్నీ కలిసి చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న ప్రతి పది మందుల్లో ఒకటి నకిలీదని డబ్ల్ యూహెచ్ వో తెలిపింది.

మలేరియా మందే టార్గెట్
ఎక్కువగా మలేరియా జబ్బును నయం చేసే మందులకు నకిలీలను తయారు చేస్తున్నారని రీసెర్చర్లు నివేదికలో వెల్లడిం చారు. వీటి వల్లే పోయిన ఏడాది 1.50 లక్షల మంది చిన్నపిల్లలు చనిపోయారని తెలిపారు. ఆ తర్వాత నిమోనియాకు ఇచ్చే యాంటిబయాటిక్స్ కు ఎక్కువగా నకిలీ మందులను క్రియేట్ చేస్తున్నారట. హైపర్ టెన్షన్ కు మార్కె ట్లో దొరుకుతున్న మందుల్లో 50 శాతం నకిలీవేనని నాన్ ప్రాఫిట్ వాచ్ డాగ్ ది ఫార్మాస్యూటికల్ సెక్యూరిటీ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)