ఇంటర్ స్టూడెంట్‌ ఎగ్జామ్స్‌ సరిగా రాయలేదని కోసుకున్నాడు..

పట్టణంలోని ప్రగతి జూనియర్ కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ స్టూడెంట్‌ మాచర్ల తరుణ్ బ్లేడ్ తో గొంతు, మర్మావయాలు కోసుకుని మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాపాయాస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నల్లగొండ రూరల్​ ఎస్సై మురళి, స్టూడెంట్‌ పేరెంట్‌ రాములు చెప్పిన దాన్ని బట్టి…మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ఎగ్జామ్స్‌ సరిగా రాయలేదని మనో వేదనకు గురై సోమవారం పరీక్ష రాసిన తరువాత తాను కాలేజీ హాస్టల్​కు వెళ్లకుండా హైదరాబాద్​ రోడ్డులోని పాలిటెక్నిక్​ కాలేజీ వైపు వెళ్లాడు. తోటి స్టూడెంట్స్‌ హాస్టల్​కు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు. తర్వాత వస్తానని చెప్పడంతో వారు వెళ్లారు .

కాలేజీ వద్ద స్పృహ తప్పిపడిపోయి…
సోమవారం సాయంత్రం హాస్టల్​కు వెళ్లకుండా పాలిటెక్ని క్​ కాలేజీ వద్ద రాత్రి 8 గంటలప్పుడు బ్లేడ్ తో ఎడమ చేయి కోసుకున్నాడు. స్పృహ తప్పి పడిపోయాడు. రాత్రి 12 గంటలకు స్పృహలోకి వచ్చి బతికి ఉన్నా నని, మళ్లీ బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. దీంతో మరోసారి రక్తస్రావంతో కుప్పకూలాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు మెలకువ వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని భావించి మర్మావయాలను కోసుకున్నాడు. వాకింగ్ కు వచ్చి న వారంతా గమనించి పోలీసులకు, అంబులెన్స్​కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)