మరిచిపోలేం.. జ్ఞాపకాలు వెంటాడుతాయి

బాయ్​​ ఎక్స్:​- తెల్లారే ఎగ్జామ్. పుస్తకాలతో తెగ కుస్తీ పట్టేస్తున్నాడు. అంత కుస్తీ పట్టినా .. హాల్లోకి పొయ్యే సరికి బ్రెయిన్ అంతా ఖాళీ. అంతా మరిచిపోయాడు.
గర్ల్​ వై:-ప్రేమ పేరుతో అబ్బాయి చేసిన మోసానికి కుమిలిపోతోంది. మరచిపోవడానికి మస్తు ప్రయత్నించింది. అయినా గాయం మాని మరవడానికి చాలా కాలమే పట్టింది. కారణమేదైనా.. ఓ విషయాన్ని మరవడం మాత్రం అంత సులభం కాదంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ సైంటిస్టులు. గుర్తు పెట్టుకోవడాని కన్నా మరచిపోవడానికే మెదడు ఎక్కువ శక్తిని వాడుకుంటుందంటున్నారు. చెడు ఘటనలు, చేదు గుర్తులను మెదడు నుంచి చెరిపేసే క్రమంలో ఎక్కువ శక్తి అవసరమవుతుందని తేల్చారు. వాటిని మరిచిపోయే క్రమంలో మన దృష్టిని వేరే వాటి మీదకు మళ్లిస్తుంటామని, అదే ఎక్కువ శక్తి ఖర్చు అవడానికి కారణమవుతుందని చెబుతున్నారు.

మరవడం, గుర్తు పెట్టుకోవడం ఆటోమేటిగ్గా జరిగి పోతుంటాయని, అదీ ఎక్కువగా నిద్రలోనే జరుగుతుందని అంటున్నారు. మామూలుగా ఇంతకుముందు స్టడీస్ లో జ్ఞాపకశక్తికి కారణమయ్యే హిప్పోక్యాంపస్, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పైనే సైంటిస్టులు ఎక్కువగా దృష్టిపెట్టారు. అయితే, తాజా స్టడీలో ఓ వస్తువు లేదా విషయాన్ని గుర్తించే మెదడులోని వెంట్రల్ టెంపోరల్ కార్టెక్స్ పై ఫోకస్ చేశారు. కొందరు ఆరోగ్యవంతమైన పెద్దలకు కొన్ని సీన్లు, కొన్ని మొహాలు చూపించారు. కొందరికి వాటిని గుర్తు పెట్టుకొమ్మని, మరికొందరికి మరిచిపొమ్మని చెప్పారు. అయితే, గుర్తు పెట్టుకోవడానికన్నా కూడా.. మరిచిపోవడానికి వాళ్లు వేరే వేరే దార్ల గురించి ఆలోచించారని తేల్చారు. కావాలని మరచిపోవడానికి ప్రయత్నించినప్పుడు టెంపోరల్ కార్టెక్స్ ఎక్కువగా పనిచేసిందని గుర్తించారు. అదే గుర్తు పెట్టుకోవడానికైతే అంతగా మెదడుపై భారం పడలేదని తేల్చారు. మరచిపోవడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే.. జ్ఞా పకశక్తి అంత ఎక్కువగా పెరుగుతుందని గుర్తించారు. ఇక, ఈ స్టడీలో పాల్గొన్నవాళ్లు ఎక్కువగా మొహాల కన్నా కూడా సీన్లనే ఎక్కువగా మరచిపోతున్నట్టు నిర్ధారించారు. మనసులో అలా గుర్తుండిపోయే ఎమోషనల్ జ్ఞాపకాలను ఎలా వదిలించుకుంటామో తెలుసుకునేందుకు ఈ స్టడీ ఉపయోగపడుతుందని అంటున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)