క్లాస్ రూమ్ లో దమ్మారోదమ్ : టీచర్లు వెరీగుడ్ అన్నారు

క్లాస్ రూమ్ అంటేనే క్రమశిక్షణ. డిసిప్లిన్ తప్పారో టీచర్ కోపానికి గురికాక తప్పదు. కానీ చైనాలో ఓ క్లాస్ రూమ్ లో అందరూ సిగరెట్ తాగారు. బెంచీలపై కూర్చున్న విద్యార్థులు గుప్పుగుప్పుమంటూ సిగరెట్లు కాల్చిపారేశారు. అబ్బాయిలే కాదు..అమ్మాయిలు కూడా స్టైల్ గా లైటర్ తో సిగరెట్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. రింగురింగులుగా పొగ వదిలారు. సిగరెట్లు తాగుతూ కో స్టూడెంట్స్ తో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఇదంతా… పరీక్షలో ఎగ్జామినర్ లాగా టీచర్ గమనిస్తుండిపోయాడు. టీచర్ వారిని మందలించాల్సింది పోయి… గుడ్… వెరీ గుడ్… అంటూ వారిని ఎంకరేజ్ చేశాడు. ఈ వీడియోలు.. ఫొటోలు చైనా సోషల్ మీడియా వైబోలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసినవాళ్లంతా స్టన్నయిపోతున్నారు.

క్లాస్ రూమ్ లో సిగరెట్ తాగడమేంట్రోయ్.. ఇదెక్కడి దరిద్రపు ట్రెండ్.. అని విసుక్కోకండి. కసురుకోకండి. మనదగ్గరే ఈ ఆఫర్ లేదే… ఈ ఫెసిలిటీ లేదే అని బాధపడిపోకండి. ఇది కూడా చదువులో భాగమేనట. ఈ ఫొటోలు వైరల్ కావడంతో.. చైనాలోని జనాలు…. టీచర్లు, మేనేజ్ మెంట్ పై కోపానికొచ్చారు. ఐతే.. దీనిపై వివరణ ఇచ్చారు యూనివర్సిటీ అధికారులు. యునాన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఈ సీన్ కనిపించింది. డీన్ జావో జెన్ జియాంగ్ దీనిపై ఎక్స్ ప్లనేషన్ ఇచ్చారు. ఇలా క్లాస్ రూమ్ లో సిగరెట్ తాగడం అనేది సబ్జెక్ట్ లో భాగమని… రోజూ జరిగేది కాదని చెప్పారు. సిగరెట్ లో ఫ్లేవర్స్… వాటితో కలిగే మత్తుపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ క్లాస్ ఉద్దేశమని వివరించారు. మార్కెట్ లోని అన్ని కంపెనీలు… వెరైటీలు.. ఫ్లేవర్లను తీసుకొచ్చి.. సిగరెట్ కాల్చడానికి ఆసక్తి ఉన్న వారికే వాటిని ఇచ్చి కాల్చమని చెప్పామన్నారు. వీటిని తాగడానికి బలవంతం చేయలేదని చెప్పారు. క్లాస్ రూమ్ లో, విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సరదాగా సిగరెట్ తాగడం అనేది యూనివర్సిటీలోనూ నిషిద్ధమేనని చెప్పారు. సబ్జెక్ట్ లో భాగంగా మాత్రమే.. సీరియస్ గా తీసుకుని దీనిపై ప్రాక్టికల్స్ చేయించామని… క్లాస్ అయిపోయాక వాటిని చెత్తబుట్టలో పడేశామని వివరించారు యూనివర్సిటీ అధికారులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)