తీసుకెళితే మీ కర్మ : రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే..

ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగదు తీసుకెళ్లే విషయంలో అనేక కండీషన్లు పెట్టారు. ఇవి వ్యాపారులకు ఇబ్బందిగా మారాయి. నగదు తరలింపుపై అనేక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 50వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకెళ్లకూడదు. అంతకంటే ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తే కచ్చితమైన ఆధారాలు చూపించాలి. లేదంటే పోలీసులు పట్టుకెళ్లిపోతారు. 2014 ఎన్నికల్లో ఇలాగే వందల కోట్లు దొరికాయి. ఇప్పుడు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నిఘా పెంచారు. క్యాష్ తరలింపులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పోలీసులు హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో 50వేల రూపాయల కంటే ఎక్కువగా నగదు తీసుకెళ్లొద్దని ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఆధారాలు లేకుండా.. కచ్చితమైన సమాచారం లేకుండా డబ్బు తరలిస్తే సీజ్ చేస్తామన్నారు. సరైన ఆధారాలు చూపిస్తే డబ్బు వెనక్కి ఇచ్చేస్తామన్నారు. సో.. బీ కేర్ ఫుల్. తీసుకెళ్లొద్దని చెప్పేశారు.. కాదని తీసుకెళితే మాత్రం మీ కర్మ.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)