విద్యార్థులే టార్గెట్ : ఈ-బిజ్ పేరుతో రూ.వెయ్యికోట్ల స్కామ్

విద్యార్థులే టార్గెట్ చేసుకుని దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడిన ఈ-బిజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థకు చెందిన నిర్వాహకుల్లో ఒకరిని పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. దేశ వ్యాప్తంగా ఈ స్కీం పేరుతో స్కామ్ నిర్వహిస్తున్నారు. సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10వేల పాయింట్లు ఇస్తారు. సభ్యులుగా చేరిన ప్రతి వ్యక్తికీ కమీషను రావాలంటే మరో ఇద్దరిని చేర్పించాలని నిబంధన పెట్టారు. యువతను ఆకట్టుకొనేందుకు ఈ లెర్నింగ్‌ కోర్సు అని చెబుతారు. దాదాపు 7 లక్షల మంది నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు వసూలు చేశారు.

సభ్యులకు కంప్యూటర్‌ కోర్సు, 58 రకాల ఇతర కోర్సులు నేర్పిస్తామని చెబుతారు. రెండు నెలల తర్వాత క్విజ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి కోర్సు పూర్తయ్యాక 50శాతం మార్కులు వస్తే సర్టిఫికెట్ ఇస్తారు. ఈ లెర్నింగ్‌ కోర్సుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్దం లేదు. రూ.30వేలతో మరో ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామంటారు. ఆదిలాబాద్‌, వరంగల్‌లో ఈ మోసంపై కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని సైబారాబాద్ పోలీస్ లకు జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి…. ఈ-బిజ్ నిర్వాహకుడు హితిక్ మల్హాన్ ను అరెస్ట్ చేశారు. 2001లో ఈ-బిజ్ ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా కేంద్రంగా నడుస్తోందని… సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అయితే ఇంకా ఎక్కడా సంస్థను స్థాపించలేదన్నారు. బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 70 కోట్ల అయిదు లక్షలు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)