కారు డ్రైవర్ వల్ల 100 ఎకరాలు పోయాయి.. షూటింగ్ నుంచి తరిమేశారు.. పెళ్లి ఫేమ్ పృథ్విరాజ్!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు తెలుగు చిత్రాల్లో పృథ్వీ రాజ్ నటించాడు. పెళ్లి చిత్రం అతడికి మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. పెళ్లి తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయని పృథ్వి తెలిపాడు. కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అలీతో సరదాగా. ఈ షోకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరై ఆసక్తికర విషయాలని పంచుకుంటున్నారు. తాజాగా పృథ్వి ఈ షోకు హాజరయ్యాడు. తాను నటించిన గత చిత్రాలని గుర్తు చేసుకున్నాడు. టాలీవుడ్ కు ఆరేళ్ళ పాటు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో పృథ్వి వివరించాడు. పెళ్లి చిత్రం తర్వాత తెలుగులో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయా. చాలా అవకాశాలు వచ్చాయి. దీనితో కొందరిలో నాపై వ్యతిరేకత కూడా పెరిగింది. కొన్ని చిత్రాల్లో హీరోలకు సమానంగా ఉండే పాత్రలు వచ్చాయి. నాకు ఇచ్చిన పాత్ర ప్రకారం బాగా నటించా. కానీ నా నటన హీరోలని డామినేట్ చేసేలా ఉందంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీనితో చాలా చిత్రాల్లో నా సన్నివేశాల్ని కట్ చేశారు అని పృథ్వి తెలిపాడు. కొన్ని అవకాశాలు కూడా చేజారాయి.

ఇంత కష్టపడి నటిస్తున్నా.. అయినా కూడా నా సన్నివేలు తొలగిస్తున్నారు అని చాలా బాధపడ్డా. ఓ సమయంలో తెలుగులో ఎందుకు నటించాలి అని అనుకుని చెన్నైకి వెళ్లిపోయినట్లు పృథ్వి తెలిపాడు. దాదాపు ఆరేళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నానని పృథ్వి తెలిపాడు. ఇప్పుడు మళ్ళీ మంచి అవకాశాలు వస్తున్నాయని పృథ్వి తెలిపాడు. నటుడిగా కొనసాగుతూనే పలు వ్యాపారాలు ప్రారంభించా. ప్రతి వ్యాపారంలో దాదాపు కోటి రూపాయల వరకు నష్టం నష్టం వచ్చింది. బిజినెస్ మనకు కలసి రాదని నటనపైనే దృష్టిపెట్టినట్లు పృథ్వి తెలిపాడు. నటుడిగా కొనసాగడం వలన బిజినెస్‌పై పూర్తిస్థాయిలో ద్రుష్టి పెట్టలేదు. అందువలనే నష్టం వాటిల్లింది అని పృథ్వి తెలిపాడు. వాస్తవానికి సీతా రామయ్యగారి మనవరాలు చిత్రంలో నేను హీరోగా నటించాలి. షూటింగ్ ప్రారంభానికి ముందు దర్శకుడికి గడ్డంతో కనిపించా. బావుందని అన్నారు. ఇప్పుడేం షూటింగులు లేవు. అందులో గడ్డం పెంచానని దర్శకుడికి చెప్పా. మరుసటి రోజు షూటింగ్ కోసం క్లీన్ షేవ్ చేసుకుని వెళ్ళా. దర్శకుడుకి నాపై పట్టరాని కోపం వచ్చింది. నిన్ను షేవింగ్ ఎవరు చేయమన్నారు. గెట్ అవుట్ అంటూ తరిమేశారు. అలా మంచి చిత్రాన్ని కోల్పోయినట్లు పృథ్వి తెలిపాడు.

వరుసగా అద్భుతమైన అవకాశాలు వస్తున్న సమయంలో రెమ్యునరేషన్ రూపంలో 10 లక్షలు చేతికి వచ్చాయి. ఆ డబ్బుతో మంచి ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్న తరుణంలో నాకు తెలిసిన వ్యక్తి హైదరాబాద్ లో 100 ఎకరాల స్థలం అమ్మకానికి ఉందని తీసుకుని వెళ్లారు. 100 ఎకరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ఉందో చూపించారు. 10 లక్షలకే 100 ఎకరాలు అంటే ఆశ్చర్యపోయాను. కొనాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో నన్ను మా కారు డ్రైవర్ పక్కకు పిలిచాడు. సర్ ఇది మొత్తం రాతి నేల. కొనడానికి 10 లక్షలు.. ఫెన్సింగ్ వేయడానికి మరో 20 లక్షలు అవుతుంది. ఈ ల్యాండ్ ని మైంటైన్ చేయలేం.. రిస్క్ తో కూడుకున్న పని అని చెప్పాడు. దీనితో ఆ ల్యాండ్ ని కొనలేదు అని తెలిపాడు. అదే అప్పుడున్న శంషాబాద్ ఏరియా. ఆ ల్యాండ్ కొని ఉంటే కోట్లకు అధిపతిని అయ్యుండేవాడిని అని పృథ్వి రాజ్ గుర్తు చేసుకున్నాడు. కారు డ్రైవర్ ని ఎందుకు తీసుకెళ్ళావు అని అలీ సరదాగా వ్యాఖ్యానించాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)