ఎయిర్‌పోర్టులో శిశువును వదిలేసి ఫ్లైటెక్కిన తల్లి.. మధ్యలో గుర్తొచ్చి..

విమానాశ్రయంలో తన శిశువును వదిలేసి ఫ్లైటెక్కేసిందో మహిళ. తీరా విమానం గాల్లో ఉండగా గుర్తొచ్చి లబోదిబోమంది. తన శిశువు తనకు కావాలంటూ కన్నీరు పెట్టుకుంది. విషయం విమాన సిబ్బందికి చేరడంతో వారు ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించారు. విషయం తెలిసి వారు నివ్వెరపోయారు. చివరికి పరిస్థితిని అర్థం చేసుకుని విమానాన్ని వెనక్కి మళ్లించేందుకు అనుమతించారు. దీంతో కథ సుఖాంతమైంది. జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. సౌదీ అరేబియాకు చెందిన ఓ మహిళ ఇటీవలే ఓ పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. జెడ్డా నుంచి కౌలాలంపూర్ వెళ్లేందుకు బిడ్డతో కలిసి విమానాశ్రయానికి చేరుకున్న ఆమె సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎస్‌వీ 832 ఎక్కింది. అయితే, విమానం మార్గమధ్యంలో ఉండగా తాను ఏదో మర్చిపోయినట్టు అనిపించింది. పక్కన చూసుకుంటే తన నవజాత శిశువు కనిపించలేదు. దీంతో షాక్‌కు గురైన ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. బిడ్డను ఎయిర్‌పోర్టులోనే మర్చిపోయానని విమాన సిబ్బందికి చెప్పడంతో పైలట్ వెంటనే ఏటీసీకి విషయం చేరవేశాడు. తొలుత పైలట్ చెప్పింది ఏటీసీ ఆపరేటర్ నివ్వెరపోయాడు. అయితే, విషయం తీవ్రతను గుర్తించిన ఏటీసీ విమానాన్ని వెనక్కి మళ్లించేందుకు అంగీకరించింది. దీంతో కథ సుఖాంతమైంది. ఏటీసీతో పైలట్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)