3 వారాలుగా మంచులోనే కూరుకుపోయిన సైనికులు

సరిహద్దు గస్తీ కాస్తున్న సైనికులపై మంచు పగబట్టింది. ఫిబ్రవరి 20వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ లోని నంగ్యా అనే ప్రాంతంలో మంచుచరియలు విరిగిపడ్డాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు సైనికులు మంచులో కూరుకుపోయారు. ప్రతికూల వాతావరణంలో సైనికులను రక్షించడానికి అధికారులు, భద్రతా సిబ్బంది విఫలప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద మంచు చరియలు విరిగిపడటంతో.. ఎక్కడో చాలా లోతుల్లో సైనికులు కప్పబడిపోయారు. ఇవాళ 21వ రోజు సైనికుల కోసం గాలింపు కొనసాగింది. గడిచిన 3 వారాల్లో మొత్తం నలుగురి మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. స్నిఫ్పర్ డాగ్స్ తో సహాయంతో మానవ దేహాల జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)