11 మంది కోహ్లీలు లేరు: ముత్తయ్య

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసి కూడా విజయం సాధించలేకపోనయినందుకు టీమిండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ క్రికెట్ అభిమానులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. శ్రీలంక స్పినర్ ముత్తయ్య మురళీధరన్ టీమిండియాకు మద్దతు పలికారు. గేమ్‌లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రాన విమర్శలు చేయడం తగదని సూచించారు. కెప్టెన్ గా వ్యవహరిస్తున్నప్పుడు సహనం ఉండాలని, భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోందని కొనియాడారు. ఏ జట్టులోనైన 11 మంది విరాట్ కోహ్లీలు ఉండరని, అలా ఉంటే ఏ జట్లు ఓటమిని చవిచూడవన్నారు. ఏ టీమ్‌లోనైన 11 మంది సచిన్ టెండూల్కర్లు లేక డాన్ బ్రాడ్‌మాన్‌లు, విరాట్ కోహ్లీలు ఉండాలని కోరుకుంటామని, కానీ అలా జరగదన్నారు. వరల్డ్ కప్ ముందు టీమిండియా ప్రయోగాలు చేయడం మంచిదే అని స్పష్టం చేశారు. టి-20లో రవిచంద్రన్ అశ్విన్ తప్పించడంపై స్పినర్ ముత్తయ్య మురళీధర్ స్పందించారు. అశ్విన్ లేడంటే ఆయన ప్లేస్‌లో చాహల్, కుల్దీప్ యాదవ్ బాగా ఆడుతున్నారన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)