సెల్ఫీ పిచ్చి.. జాగ్వర్‌ ఎన్‌క్లోజర్‌లోకి దూకిన మహిళ, ఆ తర్వాత..

పిచ్చికి మందు ఉందేమో గానీ.. సెల్ఫీ పిచ్చికి మాత్రం మందులేదు. సోషల్ మీడియాలో కొత్తగా కనిపించేందుకు, ఎక్కువ లైకులు పొందేందుకు నెటిజన్స్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సెల్ఫీలకు దిగుతున్నారు. ఈ సందర్భంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు శరీర భాగాలను కోల్పోయి వికలాంగులవుతున్నారు. తాజాగా ఆరిజోనాలోని ఫీనిక్స్ జూలో ఓ మహిళా జాగ్వర్‌తో సెల్ఫీ దిగాలనుకుంది. ఈ సందర్బంగా జాగ్వర్‌ను ఉంచే కంచె దూకి లోపలికి వెళ్లింది. అనంతరం జాగ్వర్‌తో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమెపైకి దూకింది. దీంతో ఆమె రక్షించండి అంటూ కేకలు పెట్టింది. ఎన్‌క్లోజర్‌లో అటూ ఇటు పరుగులు పెట్టింది. చివరికి అందులో నుంచి బయటపడింది. జాగ్వర్ దాడిలో ఆమె భుజానికి బలమైన గాయమైంది. ఈ సమాచారం అందగానే జూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. అయితే, ఆమె ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించిందో తెలుసుకునేందుకు జూలోని సీసీటీవీ కెమేరా ఫూటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)