ఉద్యోగులకు శుభవార్త: ఆటోమెటిక్‌గా EPF ట్రాన్స్‌ఫర్‌

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) బదిలీ విషయలోఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు శుభవార్త. ఇకపై ఉద్యోగం మారిన ప్రతీసారీ PF అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగం మారిన వెంటనే.. ఆటోమెటిక్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సదుపాయం అమలులోకి రానుంది. EPFOను డిజిటల్‌ సంస్థగా మార్చే క్రమంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు. కొత్త సంస్థలో చేరిన తర్వాత EPF ప్రక్రియ మొదలుకాగానే UAN నెంబర్ ఆధారంగా పాత EPF కంట్రిబ్యూషన్, వడ్డీ ఆటోమెటిక్‌గా బదిలీ అవుతాయి. దీంతో గత సంస్థలో పనిచేసిన పదవీకాలంలో పొందిన ప్రయోజనాలన్నీ కొనసాగుతాయని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ తెలిపింది. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా మొత్తం ఖాతాదారులందరికీ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి రానుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)