కొబ్బరి నీళ్లతో పాటు ‘కొబ్బరి’నీ తింటున్నారా.. అయితే..

భానుడి ప్రతాపానికి బాడీ డీహైడ్రేషన్‌కి గురికాకుండా ఉండాలంటే రోజూ ఓ కొబ్బరి బోండాం తాగమని చెబుతుంటారు. మరి మండే ఎండ వేడికి తట్టుకోలేక కూల్‌గా ఏదైనా తాగుదామని కూల్ డ్రింకుల జోలికి మాత్రం వెళ్లకండి. సెలైన్‌లా పని చేసే కొబ్బరి నీళ్లు తాగితే నీరసం రాకుండా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. కొన్ని కొబ్బరి బోండాల్లో నీటితో పాటు లేత కొబ్బరి కూడా ఉంటుంది. టైం లేదని ఒక్కోసారి, లేదంటే ఏం తింటాంలే నీళ్లు తాగాం కదా అని అనుకుంటారు. అసలే రష్‌గా ఉంది. ఇంక కొబ్బరి కోసం కొట్టివ్వమంటే అమ్మేవారు ఏమైనా అనుకుంటారేమోనని మొహమాటం కొంతమందికి. కానీ అలాంటివేమీ పెట్టుకోకుండా కాస్త ఆలస్యమైనా కొబ్బరి నీటితో పాటు కొబ్బరి ఉంటే కచ్చితంగా తినేసేయండి. చాలా మంచిది. లేలేత కొబ్బరిలో ఎన్నో పోషకాలు, మరెన్నో అద్భుత గుణాలు ఉంటాయి. అసలు బోండాం కొట్టమని అడిగేముందే కొంచెం లేత కొబ్బరి ఉన్నది కొట్టు బాస్ అని అడిగేయండి. ఎంచక్కా నీళ్లు తాగి కొబ్బరి తినేసేయండి. లేత కొబ్బరి ఉన్న నీళ్లు తియ్యగా కూడా ఉంటాయి. అవి తాగుతుంటే ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది. మరి ఈ లేత కొబ్బరిలో ఉన్న మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామా..

-లేత కొబ్బరి మన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది ఎండాకాలం డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు.
-శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్‌ను లేత కొబ్బరి బయటకు పంపిస్తుంది.
-లేత కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి గుండెకు మేలు చేస్తాయి. -బాడీలో వ్యర్థాల్ని బయటకు పంపుతాయి. పాడైన కణాలను రిపేర్ చేస్తాయి.
-లేత కొబ్బరిలో విటమిన్ ఏ,బీ,సీ, థయామిన్, రైబోప్లావిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఎక్కువగా ఉంటాయి.
-మలబద్దకాన్ని నివారిస్తుంది.
-లైంగిక శక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది. స్పెర్మ్ కౌంట్ వృద్ధి చేసే గుణాలు లేత కొబ్బరిలో ఉన్నాయి.
-అయితే కొబ్బరి ముదురుగా ఉంటే మాత్రం దాని జోలికి వెళ్లకండి. దాన్ని తినకపోవడమే మంచిది. తిన్నదగ్గరనుంచి దగ్గు, నిమ్ము, ఆయాసం వంటి సమస్యలొస్తాయి.
-అదే లేత కొబ్బరి అయితే హాపీగా తినేయొచ్చు. అదండీ సంగతి.. తియ్యటి నీళ్లు తాగేస్తూ.. లేత కొబ్బరి తినేస్తూ సమ్మర్ సమస్యలకు చెక్ పెట్టేద్దాం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)