గ్యాంగ్ స్టర్ నయీం స్థానంలోకి ఫయీం.. మళ్ళీ దందా షురూ చేయడానికి భార్య హసీనా మాస్టర్ ప్లాన్

నయీం బ్రతికే ఉన్నాడు అంటున్న భార్య హసీనా బేగం. ఇలా చెప్పి అందరిని భయపెట్టి దందా చేయడానికి మాస్టర్ ప్లాన్ చేసింది నయీం భార్య హసీనా బేగం. నయీం లా ఉండే ఫయీం ను గెటప్ మార్చి అచ్చం నయీం లా తయారు చేసింది హసీనా బేగం. నయీం సామ్రాజ్యానికి బిగ్ బాస్ గా వ్యవహరించేందుకు ఫయీం ను తీసుకొచ్చింది. నయీం లాగే టైట్ టి షర్ట్, మెడలో గొలుసులు, కుడి చేతికి వాచ్, ఎడమ చేతికి బంగారు బ్రాస్ లెట్, చేతికి ఉంగరాలను ఫయీం కు వేసి ఇతడే నయీం అని నమ్మించే ప్రయత్నం చేసింది నయీం భార్య హసీనా బేగం. ఫయీం ను చూపించి నయీం బ్రతికే ఉన్నాడంటూ దందాలకు తెరలేపడనికి స్కెచ్ వేసింది నయీం భార్య. క్యాప్ ఉల్టా పెట్టి కార్ గ్లాస్ కొద్దిగా ఓపెన్ చేస్తే నయీం వచ్చినట్టు సంకేతం. ఇదే తరహాలో నయీం వచ్చినట్టు ఫయీం తో చేపించి మళ్ళీ దందా షురూ చేయడానికి భార్య హసీనా బేగం మాస్టర్ ప్లాన్ చేసింది. హసీనా బేగం.. నయీం అనుచరులతో కలిసి నయీం ఉన్నప్పుడు ఎలా దందా చేసాడో అలాగే ఫయీం ను అడ్డం పెట్టుకొని దందా చేయడానికి చేసింది. ఆ ప్లాన్ ను రాచకొండ పోలీసులు కనిపెట్టి అడ్డుకట్టవేసి అందరిని అరెస్ట్ చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)