పెళ్లైన తెల్లారే నవ వధువుకు ఊహించని కష్టం.. అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన సమయంలో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది

నగరంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంట.. పట్టమని పది గంటలు కూడా కలిసుండలేదు. కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆ వధువుకు పెళ్లైన మరుసటి రోజే ఊహించని కష్టం వచ్చింది. అత్తారింట్లో అడుగుపెట్టాల్సిన సమయంలో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది..? నవ వధువుకు వచ్చిన కష్టం ఏమిటి..? ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కింది..?

బంజారాహిల్స్ రోడ్డు నం. 2లోని ఇందిరానగర్‌లో నివాసముండే పద్మ అనే మహిళకు ఈ నెల 8న చిలుకూరు సమీపంలోని మాతాగాయత్రి మందిర్‌లో వీరభద్ర అనే యువకుడితో వివాహం జరిగింది. అదే రోజు నవ దంపతులిద్దరూ పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చారు. తర్వాతి రోజు ఉదయం.. వీరభద్ర టిఫిన్ చేసి వస్తానని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఏమైందా అని ఆరా తీసినా ఫలితం లేదు. దీంతో పద్మ చుట్టు పక్కల వెదికింది. తర్వాత అతడి స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసింది. అయినా, ఆచూకీ లభించకపోవడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)