ప్రాణం తీసిన వీడియో గేమ్.. బాధలో తల్లిదండ్రులు

పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. సెల్‌‌‌‌ఫోన్లో వీడియో గేమ్ లు ఆడుతూ టైం ఎందుకు వేస్ట్‌‌ చేసుకుంటున్నావని తల్లి మందలించినందుకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రజ్ఞా పూర్‌ లో జరిగింది. ప్రజ్ఞా పూర్‌ లో నివసిస్తున్న వెంకటనారాయణ కుమారుడు సాయి చరణ్‌ (18) గజ్వేల్‌‌‌‌ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్‌ చదువుతున్నాడు. కొన్ని నెలలుగా సెల్‌‌‌‌ఫోన్‌ లో వీడియో గేమ్‌‌‌‌లు ఆడుతుంటే తల్లిదండ్రులు వారిస్తూ వచ్చారు . ఆదివారం రాత్రి సాయి గేమ్స్ ఆడుతుంటే తల్లి మందలించింది. దీంతో అతడు ఇంట్లో ఒక గదిలోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. కొడుకు ఎంతకుబయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు కిటికీలోంచి చూడగా ఉరి వేసుకుని ఉన్నాడు. వెంటనే తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే సాయి చరణ్‌ మృతి చెందాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)