ఇదేంది సారూ : పవన్ కళ్యాణ్‌కు రెండు చోట్ల ఓటు

రెండు వేర్వేరు ఎపిక్ నెంబర్లతో ఈ ఓటు ఉంది. ఒకటి విజయవాడ ఈస్ట్, మరొకరిఏలూరు నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఓ పార్టీ అధినేతకు రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం విశేషం. ఈసీ వెబ్ సైట్ లోనూ ఈ విషయం స్పష్టంగా బయటపడింది. విజయవాడ ఈస్ట్ లో ఒకటి, ఏలూరు నియోజకవర్గంలో ఓ ఓటు ఉంది. రెండు ఓట్లు వేర్వేరు అడ్రసులు, ఎపిక్ నెంబర్లతో ఉన్నాయి. కొణిదెల పవన్ కల్యాణ్ పేరుతోనే ఉన్నాయి. రెండున్నర సంవత్సరాల క్రితం ఏలూరులో ఓటు హక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు పవన్ కల్యాణ్. అందులో భాగంగా ఏలూరులో ఓటు నమోదు చేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అనూహ్యంగా రెండో ఓటు కూడా బయటకు వచ్చింది. విజయవాడ ఈస్ట్ లో కూడా ఓటు ఉన్నట్లు ఈసీ వెబ్ సైట్ చూపిస్తోంది. నాలుగు నెలలుగా పవన్.. విజయవాడ ఈస్ట్ లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. బెంజ్ సర్కిల్ లో ఆఫీస్ ఓపెన్ చేసి.. వ్యవహారాలన్నీ అక్కడి నుంచే నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బెజవాడ ఈస్ట్ నుంచి కూడా ఓటు నమోదు అయ్యి ఉంటుందని అంటున్నారు కార్యకర్తలు. 

ఎన్నికల నియమావళి ప్రకారం ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. 
దేశవ్యాప్తంగా ఇదే రూల్. ఇప్పుడు పవన్ కు రెండు ఓట్లు ఉన్నాయి. ఓ ఓటు తీసివేయాలి. మరి ఎక్కడి ఓటు తొలగించుకుంటారు అనేది కూడా చర్చనీయాంశం అయ్యింది. ఏలూరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే విజయవాడ ఈస్ట్ ఓటు పోతుంది. ఒకవేళ విజయవాడ ఈస్ట్ నుంచి బరిలోకి దిగే ఆలోచన ఉంటే మాత్రం ఏలూరు ఓటు గోవిందా. ఈ విషయం తేలాలి అంటే.. మార్చి 15వ తేదీ వరకు ఓట్ల సవరణ ఉంది. అప్పటి వరకు వేచిచూడాల్సిందే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)