కృష్ణ జింకల వేట కేసులో టబు,సోనాలికి సమన్లు

సినీ నటులు టుబు, సోనాలి బింద్రే, సైఫ్‌ అలీఖాన్‌, దుష్యంత్‌ సింగ్‌, నీలమ్‌ కొఠారిలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1998 అక్టోబర్‌లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి వీరంతా కృష్ణజింకలను వేటాడారని కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన తీర్పును గతేడాది జోధ్‌పూర్‌ కోర్టు తీర్పునిస్తూ సల్మాన్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. మిగతావారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే ఈ కేసులో సల్మాన్‌తో పాటు మిగతా వారిది కూడా సమాన తప్పు ఉందని భావిస్తూ జోధ్‌పూర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో కోర్టు వారికి సమన్లు జారీ చేసింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)