పుల్వామా ఉగ్రదాడి నిందితుడ్ని మట్టుబెట్టిన భారత సైన్యం

పూల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడంలో భారత సైన్యం విజయం సాధించింది. ఇవాళ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పుల్వామా ఉగ్రదాడి నిందితుడ్ని భారత సైన్యం మట్టుబెట్టింది. పుల్వామా ఉగ్ర దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే ఉగ్రవాది ముదస్సర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు అధికారులు దృవికరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో పుల్వామా దాడి సూత్రధారి, 23 ఏళ్ల ఎలక్ట్రీషియన్‌ మహ్మద్‌ భాయ్‌ కూడా ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురి మిలిటెంట్ల మృతదేహాలు దగ్ధమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. దీంతో వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు పింగ్లిష్‌ ప్రాంతంలో చేపట్టిన గాలింపు చర్యల్లో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామాలో ఘటన వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్‌ గ్రవాది ముదసర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గతంలోనే గుర్తించారు. జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను ఖాన్‌ సమకూర్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)