పరగడుపున మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే...

కూరల్లో వేస్తేనే వాసన పడదు. ఇక పచ్చిది ఎలా తింటారండి అంటే.. మరి దానిలో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే ఇష్టంగా కాకపోయినా ఖచ్చితంగా తినడానికి ప్రయత్నిస్తారు. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించే యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మక్రిములను చంపే యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఉదయాన్ని పరగడుపున ఓ మూడు వెల్లిల్లి రెబ్బలను వలిచి తీసుకుంటే శరీరంలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పని చేస్తాయి. కొలెస్ట్రాల్, బీపీ, డయాబెటిస్ వంటి వాటిని నివారించవచ్చని పరిశోధనలో తేలింది. గుండెజబ్బులు, హార్ట్ ఎటాక్, కేన్సర్ వంటి వాటి నుంచి, ఇన్ఫెక్షన్ల భారి నుంచి కాపాడతాయి.

డయాబెటిసి కంట్రోల్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టైప్2 డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్‌ని 57 శాతానికి తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. బ్రెయిన్‌ని చురుగ్గా మారుస్తుంది. మతిమరుపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధిని రాకుండా చేస్తుంది. అధిక బరువుని తగ్గించుకోవచ్చు: పచ్చి వెల్లుల్లి బాడీలోని అదనపు కొవ్వుని కరిగిస్తుంది. ఆరోగ్యం సులువుగా జీర్ణం అయ్యేలా చూస్తుంది. టీబీ, న్యుమోనియా, జలుబు, ఊపిరితిత్తుల్లో కఫం చేరడం, ఆస్తమా, దగ్గు తదితర సమస్యలకు ఇది చక్కటి ఔషధం. ఒకేవేళ పచ్చిది తినలేకపోతే కొద్దిగా రంగు మారే వరకు వేడి చేసుకుని తినవచ్చు. వెల్లుల్లిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా నోటికి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. వెల్లుల్లి అంటే పడని వారు తీసుకోకపోవడమే మంచిది. చర్మంపై దద్దుర్ల వచ్చినా, తలనొప్పి, వాంతులు, విరోచనాలు లాంటివి ఉన్నా, చర్మంపై రాషెస్ వస్తున్నా, పచ్చి వెల్లుల్లి తీసుకోవడం మానేయాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)