రాత్రి 11గంటలకు ఆటో తీసుకుని భర్త బయటకు వెళ్లగానే..

బంధుత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేశారు. హర్యానాకు చెందిన దంపతులకు నలుగురు కుమారులు. జీవనోపాధి కోసం మూడు నెలల క్రితం నగరానికి వచ్చి జల్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలో నివసిస్తున్నారు. ఆమె భర్త ఆటో నడుపుతున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసి 11 గంటలకు ఆటో తీసుకొని బయటకు వెళ్లాడు. గమనించిన బంధువులు మహ్మద్‌ ఆజం(35), మహ్మద్‌ అమ్జద్‌(30), మరో వ్యక్తి అతడి ఇంటికి వెళ్లారు. ఆటో డ్రైవర్‌ భార్య ఉన్న గదిలోకి ఆజం, అమ్జద్‌ వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తి మొదటి గదిలో ఉన్న ఆమె నలుగురు పిల్లలు బయటకు రాకుండా కాపలా కాస్తున్నాడు. ఆమెతో 15 నిమిషాలు కుటుంబ విషయాలు మాట్లాడిన ఆజం, అమ్జద్‌ తర్వాత అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె వారి బారి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించగా గది తలుపులు మూసి అత్యాచారం చేశారు. అర్ధరాత్రి ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. భర్త వచ్చిన తర్వాత జరిగిన విషయం చెప్పింది. భార్యను ఆటోలో తీసుకొని సమీపంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆజం, అమ్జద్‌ ఎక్కడ అని ప్రశ్నించగా.. వారు రాత్రి నుంచి కనిపించడం లేదని చెప్పారు. ఘటనపై పహాడిషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)