పీకలదాకా తాగి పెళ్లిపీటలెక్కాడు..

పట్నా : వివాహ వేదికపైకి పెళ్లికొడుకు మద్యం సేవించి రావడంతో వధువు పెళ్లికి నిరాకరించిన ఘటన బిహార్‌లోని దుమారిలో చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం సేవించి పెళ్లి కుమారుడు మంటపానికి రావడంతో అతడితో వివాహానికి నిరాకరించిన యువతి తన తల్లితండ్రులతో ఆ విషయం తెలిపింది. వూటుగా మద్యం తాగిన పెళ్లికుమారుడు పరిసరాలను మర్చిపోయి వేదికపై అమర్యాదకరంగా వ్యవహరించడంతో అతడిని పెళ్లి చేసుకునేందుకు తమ కుమార్తె నిరాకరించిందని పెళ్లికుమార్తె తండ్రి త్రిభువన్‌ షా చెప్పారు.

దుమ్రి చాప్రియా గ్రామంలో జరిగిన వివాహ తంతులో పెళ్లి కుమారుడు బబ్లూ కుమార్‌ విపరీతంగా మద్యం సేవించడంతో తూలుతూ ఉన్నాడని, ఆయన వివాహ కార్యక్రమాలను చేపట్టే స్థితిలో లేడని బంధువులు చెప్పుకొచ్చారు. వరుడు తీరును గమనించిన పెళ్లి కుమార్తె వేదిక నుంచి దిగివెళ్లిపోయారు. ఇరు కుటుంబాల పెద్దలు వధువు రింకీ కుమారికి నచ్చచెప్పినా ఆమె వివాహానికి సుముఖత చూపలేదు. రింకీ తల్లితండ్రుల నుంచి పెళ్లికుమారుడి కుటుంబం తీసుకున్న కట్నం సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్తులు పట్టుబట్టారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)